India-Pak Border : భారత్-పాక్ సరిహద్దులో ఎన్‌కౌంటర్.. 47కిలోల హెరాయిన్ స్వాధీనం!

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ ఆపరేషన్‌లో 47కిలోల హెరాయిన్ బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది.

India-Pak Border : భారత్-పాక్ సరిహద్దులో ఎన్‌కౌంటర్.. 47కిలోల హెరాయిన్ స్వాధీనం!

Bsf Seizes 47 Kg Heroin, Ar

India-Pak Border : భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ ఆపరేషన్‌లో 47కిలోల హెరాయిన్ బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. హెరాయిన్‌తో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సీజ్ చేశారు. పంజాబ్‌లోని గురుదాస్ పూర్‌ జిల్లా సరిహద్దులో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. పాకిస్తాన్ స్మగ్లర్లకు భద్రతా దళాలకు మధ్య ఎన్ కౌంటర్ ఆపరేషన్ జరిగింది. కర్తార్ పూర్ కారిడర్ సమీపంలో ఎదురుకాల్పులు జరగగా.. బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు గాయపడ్డారు.

గురుదాస్ పూర్ లోని చందూ వాడ్లా పోస్టు దగ్గర ఎన్ కౌంటర్ జరిగిందని బీఎస్ఎఫ్ డీఐజీ వెల్లడించారు. శుక్రవారం ఉదయం సమయంలో పాకిస్తాన్ స్మగ్లర్ల కదిలకలను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. పాక్ స్మగ్లర్లు ఒక్కసారిగా భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జవాను ఒకరు అమరుడయ్యాడు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రస్తుతం ఆ జవాను ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బీఎస్ఎఫ్ సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పాక్ స్మగ్లర్ల నుంచి భారీ మొత్తంలో హెరాయిన్ స్మగ్లింగ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 47 ప్యాకెట్లను సీజ్ చేశారు. ఏడి ప్యాకెట్లలో ఓపియం ఉందని బీఎస్ఎఫ్ అధికారులు భావిస్తున్నారు. రెండు మ్యాగ్జిన్లతో పాటు ఒక చైనీస్ రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏకే 47 నాలుగు మ్యాగ్జిన్ లను బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది.

Read Also : Bonda Uma: వైసీపీ నేతల కనుసన్నల్లోనే కొత్తజిల్లాల విభజన: బోండా ఉమా