Shilpa Chowdary : శిల్పా చౌదరి కేసులో ట్విస్ట్.. పోలీసులను ఆశ్రయించిన రాధికా రెడ్డి

కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను వందల కోట్ల మేర మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు..

Shilpa Chowdary : శిల్పా చౌదరి కేసులో ట్విస్ట్.. పోలీసులను ఆశ్రయించిన రాధికా రెడ్డి

Shilpa Chowdary

Shilpa Chowdary : కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను వందల కోట్ల మేర మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. విచారణ సందర్భంగా పోలీసులు శిల్పా చౌదరి నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. ఈ క్రమంలోనే రాధికా రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రాధికా రెడ్డి అనే యువతి తనను మోసం చేసినట్లు శిల్పా చౌదరి పోలీసులకు తెలిపింది. ఆమె తన నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకుందని వెల్లడించింది.

తనకు ఎవరినీ మోసం చేసే ఉద్దేశం లేదని.. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో వారికి చెల్లించలేకపోయానని పోలీసుల విచారణలో శిల్ప చెప్పినట్లు తెలుస్తోంది. ప్రముఖుల దగ్గర తీసుకున్న డబ్బుల్లో 6శాతం వడ్డీకి రాధికా రెడ్డికి ఇచ్చానని, అయితే, ఆమె తనను మోసం చేసిందని, తిరిగి ఇవ్వకపోవడంతోనే తాను చెల్లించలేకపోయానని శిల్పా చౌదరి చెప్పినట్లు సమాచారం. రాధికా రెడ్డి రియల్ ఎస్టేట్‌తో పాటు ఈవెంట్ మేనేజ్‌మెంట్ నడుపుతున్నట్లు శిల్పా చౌదరి తెలిపింది.

Lemon Juice : వేడి నీటితో నిమ్మరసం…ఆరోగ్యానికి మంచిదా?

తాను ఎవరినీ మోసం చేయలేదని.. చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు డబ్బులు ఇచ్చారని శిల్పా చౌదరి చెప్పినట్లు తెలుస్తోంది. మరికొందరు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు డబ్బులు ఇచ్చారని.. వాటిని తాను రియల్ ఎస్టేట్‌లో పెట్టానని ఆమె చెప్పుకొచ్చినట్లు సమాచారం. తనకు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో తిరిగి ఇవ్వలేకపోయానని.. ఎవరినీ మోసం చేసే ఉద్దేశం లేదని, డబ్బులు ఇచ్చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

రెండో రోజు విచారణలో భాగంగా నార్సింగి పోలీసులు ఆమెను గండిపేటలోని సిగ్నేచర్ విల్లాస్‌కు తీసుకెళ్లారు. శిల్పా చౌదరి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ లాకర్‌ను కూడా ఓపెన్ చేసినట్లు సమాచారం. రూ.6కోట్లు రాధికా రెడ్డికి ఇచ్చానని చెప్పడంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

కాగా, దీనిపై రాధికా రెడ్డి స్పందించారు. శిల్పా చౌదరి చెప్పిన దాంట్లో వాస్తవం లేదన్నారు. ఈ మేరకు ఆమె పోలీసులను ఆశ్రయించారు. శిల్పా చౌదరి ఏవైనా ఈవెంట్స్ చేసినపుడు తనకు కాంట్రాక్ట్స్ మాత్రమే ఇచ్చేది తప్పా, ఆమెకి నేను ఇవ్వాల్సింది ఏమీ లేదని పోలీసులతో చెప్పింది. కొంత కాలంగా జరిగిన ఈవెంట్స్ కి సంబంధించిన డబ్బులు శిల్పా చౌదరి తనకే చెల్లించాల్సింది ఉందని రాధికారెడ్డి చెప్పింది. మీడియాలో వస్తున్న వార్తలకి తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.