Viral Video: హోలీ వేడుకల్లో జపనీస్ మహిళతో అసభ్య ప్రవర్తన.. వైరల్ అవుతున్న వీడియో
ఢిల్లీ వుమెన్స్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హోలీ రోజున విదేశీ మహిళపై లైంగిక దాడి జరిగింది. ఇది చాలా దారుణం. వీడియో చూసి చాలా బాధపడ్డాను. ఈ వీడియో ఆధారంగా విచారణ చేసి నిందితులను శిక్షించాలని నేను ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తున్నాను. చాలా సిగ్గు పడే ప్రవర్తన’’ అని ట్వీట్ చేశారు.

Japanese Woman Being Harassed In Delhi On Holi, Video Goes Viral
Viral Video: బుధవారం దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా హోలీ జరిగింది. దేశంలోని ప్రజలు పెద్ద ఎత్తున భిన్న రంగులతో హోలీ జరుపుకున్నారు. అయితే కొంత మంది ఆకతాయిలు దీన్ని అదునుగా తీసుకుని జపనీస్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రంగు పూస్తున్నామన్న వంకతో ఆమెను అసభ్యంగా తాకారు. కొందరు అసభ్య పదాలు వాడారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉదంతం ఇది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ జపనీస్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. జపనీస్ ఎంబసీని మెయిల్ ద్వారా మహిళ వివరాలు కోరారు. దీని మీద ఎవరూ కేసు నమోదు చేయలేదని, తామే దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. వీడియోలో కనిపించే ల్యాండ్‌మార్క్ ఆధారంగా ఇది పహార్‌గంజ్‌కి సంబంధించినదని తెలుస్తోందని, అయితే ఆ ప్రాంతంలో అలాంటి సంఘటన ఏదైనా జరిగిందా లేదా వీడియో పాతదా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
For those who were against the #BHARATMATRIMONY Holi campaign. A Japanese tourist in India. Imagine your sister, mother or wife being treated like this in another county? Maybe you will understand then. pic.twitter.com/VribIpXBab
— Ram Subramanian (@iramsubramanian) March 10, 2023
వీడియోలో కొంత మంది వ్యక్తులు ఆమెకు రంగు పూస్తు వెలికి చేష్టలకు దిగారు. ఆమె ‘బై, బై, బై’ అని పలుమార్లు అన్నప్పటికీ వదలలేదు. కాసేపటికి వారిని వదిలించుకుని ఏమీ చేయలేని స్థితిలో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఢిల్లీ వుమెన్స్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హోలీ రోజున విదేశీ మహిళపై లైంగిక దాడి జరిగింది. ఇది చాలా దారుణం. వీడియో చూసి చాలా బాధపడ్డాను. ఈ వీడియో ఆధారంగా విచారణ చేసి నిందితులను శిక్షించాలని నేను ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తున్నాను. చాలా సిగ్గు పడే ప్రవర్తన’’ అని ట్వీట్ చేశారు.