Terrorist Attack: కాశ్మీర్‌లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

బుధవారం సాయంత్రం 7:55 ప్రాంతంలో అమ్రీన్ భట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని..ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించగా..ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారని పోలీసులు పేర్కొన్నారు

Terrorist Attack: కాశ్మీర్‌లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

Terro

Terrorist Attack: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అదును చూసి పౌరులను పొట్టనబెట్టుకుంటున్నారు ఉగ్రవాదులు. మధ్య కాశ్మీర్ లోని బుధ్గాం జిల్లా..చదూర ప్రాంతంలోని హిష్రూ ఏరియాలో బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. స్థానికంగా ఓ టీవీ నటి ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు టీవీ నటి అమ్రీన్ భట్ (35)ను దారుణంగా కాల్చి చంపారు. మృతురాలి మేనల్లుడు 10 ఏళ్ల బాలుడిపైనా ఉగ్రవాదులు కాల్పులు జరుపగా చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఘటనపై జమ్మూకాశ్మీర్ పోలీసులు స్పందిస్తూ..బుధవారం సాయంత్రం 7:55 ప్రాంతంలో అమ్రీన్ భట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని..ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించగా..ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారని పోలీసులు పేర్కొన్నారు. బులెట్ గాయాలతో బయటపడ్డ 10 ఏళ్ల బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Other Stories:Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనా వేశారు. కాల్పులపై సమాచారం అందుకున్న వెంటనే.. ఆప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయని..ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నట్లు కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా, వారం రోజుల క్రితమే కాశ్మీర్ లో రాహుల్ భట్ అనే ఓ యువ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈఘటనపై స్థానికంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. నేడు జరిగిన మారణహోమంతో కలిపి గత రెండు వారాల్లో ఇది మూడో ఘటన కావడం కాశ్మీర్ లో ఉగ్రవాద పరిస్థితులపై ఆందోళన వ్యక్తం అవుతుంది.

other stories:Terror Funding Case : యాసిన్ మాలిక్‌కి జీవిత ఖైదు విధించిన ఎన్ఐఏ కోర్ట్

కాగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ కశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌కు పాటియాలా హౌస్ ఎన్ఐఏ కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. మాలిక్ కు ఉరిశిక్ష విధించాలంటూ ఎన్ఐఏ న్యాయవాది వాదించినా..కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ఈనేపథ్యంలోనే కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడడం ప్రాధాన్యత సంతరించుకుంది.