Hyderabad : హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 20కి పైగా కార్లు దగ్ధం

Hyderabad : మంటలు ఆర్పుతున్న సమయంలో కార్ల గ్యారేజీలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి.

Hyderabad : హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 20కి పైగా కార్లు దగ్ధం

Hyderabad

LB Nagar Fire Accident : హైదరాబాద్ ఎల్బీ నగర్ లో మంగళవారం (మే 30) రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ టింబర్ డిపో, దాని పక్కనే ఉన్న కార్ల షోరూమ్ లో మంటలు ఎగసిపడ్డాయి. తొలుత టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. డిపో పక్కనే ఉన్న పాత కార్ల షోరూమ్ కు కూడా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో 20కి పైగా కార్లు కాలిపోయాయి. అది కార్ మెన్ కార్ అనే సెకండ్ హ్యాండ్ కార్ల గ్యారేజ్ అని తెలిసింది.

రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. మంటలు ఆర్పుతున్న సమయంలో కార్ల గ్యారేజీలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు స్థానికులను ఖాళీ చేయించారు.

Also Read..Delhi Girl Case : ఢిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య.. నిందితుడు సాహిల్ అరెస్ట్.. షాకింగ్ వీడియో

ఈ అగ్నిప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీగా మంటలు ఎగసిపడటంతో ఏం జరుగుతుందోనని కంగారు పడ్డారు. అయితే, దాదాపు గంటసేపు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. మంటలు అదుపులోకి రావడంతో అటు స్థానికులు, ఇటు అగ్నిమాపక సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది పటిష్ట చర్యలు తీసుకున్నారు. టింబర్ డిపో పూర్తిగా అగ్నికి ఆహుతైంది. టింబర్ డిపో పక్కనే సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ ఉంది. అందులోకి మంటలు వ్యాపించాయి. ఆ షో రూమ్ లో 100కి పైగా కార్లు ఉన్నాయి. వాటిలో 20కి పైగా కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.