Mirzapur: గుడిలో బ్లేడుతో గొంతు కోసుకుని వ్యక్తి మృతి.. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడమే కారణమా?

ఉత్తర ప్రదేశ్‌లో తల్లితో పాటు అమ్మవారి గుడికి వెళ్లిన ఒక వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శరీరంపై పలు చోట్ల కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయాడు.

Mirzapur: గుడిలో బ్లేడుతో గొంతు కోసుకుని వ్యక్తి మృతి.. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడమే కారణమా?

Updated On : October 22, 2022 / 8:28 PM IST

Mirzapur: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. తల్లితో కలిసి అమ్మవారి గుడికి వెళ్లిన ఒక వ్యక్తి, అదే గుళ్లో గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మీర్జాపూర్ జిల్లాలోని ఘట్గా ధామ్ పరిధిలో ఉన్న షీట్లా మాత ఆలయంలో శనివారం ఉదయం జరిగింది.

Delhi Commission for Women: అత్యాచారం పేరుతో మహిళ నాటకం.. ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్.. మహిళపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనోజ్ కుమార్ (27) అనే వ్యక్తి, తన తల్లి కేసరి దేవితో కలిసి స్థానిక షీట్లా మాత ఆలయానికి వెళ్లాడు. అక్కడ కేసరి దేవి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. మనోజ్ కుమార్ మాత్రం గేట్ దగ్గర ఉండిపోయాడు. తల్లి ప్రదక్షిణలు చేస్తుండగా, వెంట తెచ్చుకున్న బ్లేడుతో ఒంటిపై అనేక చోట్ల కోసుకున్నాడు. ఈ క్రమంలో గొంతు కూడా కోసుకున్నాడు. వెంటనే అతడికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ పాటికే అతడు తీవ్ర రక్త స్రావంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. గమనించిన ఇతరులు, తల్లి వెంటనే అతడ్ని రక్షించే ప్రయత్నం చేశారు.

India vs Pakistan: రేపే ఇండియా వర్సెస్ పాక్ టీ20 మ్యాచ్.. వర్షం ముప్పు తప్పదా?

స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆలయంలోని సీసీ కెమెరా దృశ్యాల్ని పరిశీలిస్తున్నారు. కాగా, ప్రస్తుతం బీఏ చదువుతున్న మనోజ్ కుమార్ కొద్ది రోజులుగా మానసిక సమస్యల్తో బాధపడుతున్నట్లు తెలిసింది.