India vs Pakistan: రేపే ఇండియా వర్సెస్ పాక్ టీ20 మ్యాచ్.. వర్షం ముప్పు తప్పదా?

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. మెల్‌బోర్న్‌లో ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే, ఆదివారం అక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా.

India vs Pakistan: రేపే ఇండియా వర్సెస్ పాక్ టీ20 మ్యాచ్.. వర్షం ముప్పు తప్పదా?

India vs Pakistan: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇండియా తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్తాన్‌తో ఆడబోతుంది. ఆదివారం మెల్‌బోర్న్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే, మెల్‌బోర్న్‌లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Delhi Commission for Women: అత్యాచారం పేరుతో మహిళ నాటకం.. ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్.. మహిళపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

ప్రస్తుతం అక్కడ వాతావరణం మేఘావృతమై ఉంది. దీంతో ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మ్యాచ్ జరిగే ఏదో ఒక సమయంలో వర్షం పడొచ్చని అంచనా. ఇదే జరిగితే మ్యాచ్‌కు అంతరాయం కలగడం ఖాయం. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు వర్షం పడే అంశంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. తాము వర్షం పడుతుందని అనుకోవడం లేదని, 40 ఓవర్ల మ్యాచ్ ఆడేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నట్లు చెప్పాడు. ఈ రోజు ఉదయం మెల్‌బోర్న్‌లో తాను నిద్ర లేచే సరికి ఆకాశం మేఘాలతో కప్పి ఉందని, కానీ ప్రస్తుతం ఎండగానే ఉంది అన్నాడు. ఏదేమైనా ఆటగాళ్లు పూర్తి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులాగా ఎనిమిది ఓవర్లు మాత్రమే ఆడాల్సి ఉంటుందని అనుకోవడం లేదన్నాడు.

Jharkhand: స్కూటీపై వెళ్తున్న యువతి కిడ్నాప్… అత్యాచారానికి పాల్పడ్డ పది మంది

మ్యాచ్ జరగకపోతే, ఆటగాళ్లతోపాటు ఫ్యాన్స్ కూడా నిరాశకు గురవుతారని అభిప్రాయపడ్డాడు. మరో వైపు ఈ మ్యాచ్ కోసం అక్కడి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ప్రేక్షకులు భారీ స్థాయిలో హాజరయ్యే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.