man killed his wife : ఎప్పుడూ భార్య ఫోన్ ఎంగేజ్ ఉండటంతో మొదలైన అనుమానం….హత్య

పెళ్లై 13 ఏళ్లు అయ్యింది. ఇటీవలి కాలంలో భార్యకు ఫోన్ చేస్తుంటే తరచూగా ఆమె ఫోన్ ఎంగేజ్ అయి ఉంటోంది. దీంతో అనుమానం పెంచుకున్న భర్త, భార్యను గొంతు నులిమి చంపి హత్య చేశాడు.

man killed his wife : ఎప్పుడూ భార్య ఫోన్ ఎంగేజ్ ఉండటంతో మొదలైన అనుమానం….హత్య

Husband Killes Wife

man killed his wife : పెళ్లై 13 ఏళ్లు అయ్యింది. ఇటీవలి కాలంలో భార్యకు ఫోన్ చేస్తుంటే తరచూగా ఆమె ఫోన్ ఎంగేజ్ అయి ఉంటోంది. దీంతో అనుమానం పెంచుకున్న భర్త, భార్యను గొంతు నులిమి చంపి హత్య చేశాడు.

అనంతపురం జిల్లా కనగానపల్లికి చెందిన చిక్కన్నయ్య ఓ ప్రైవేట్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి కర్నూలు జిల్లా నంచెర్లకు చెందిన కవిత అనే యువతితో 2008లో వివాహం అయ్యింది. ప్రస్తుతం వీరికి  పదకొండేళ్ల సంతోష్,  తొమ్మిదేళ్ల జాహ్నవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.  చిక్కన్నయ్య అనంతపురంలోని జీసస్ నగర్ లో భార్యా పిల్లలతో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నాడు.

పెళ్ళైన 11 ఏళ్ల వరకు వారి కాపురం సజావుగానే సాగింది. భార్య  ఫోన్ మాట్లాడుతూ ఉంటటంతో వారి కుటుంబంలో కలతలు రావటం మొదలయ్యాయి.  విధి నిర్వహణ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన చిక్కన్నయ్య … భార్యకు ఫోన్ చేసిన ప్రతిసారి ఆమె ఫోన్ ఎంగేజ్ వచ్చేది. భర్త ఫోన్ చేస్తే,  ఆమె ఎవరితో ఒకరితో మాట్లాడుతూ… ఆమె ఫోన్ బిజీ గా ఉండి… వేరే కాల్ లో మాట్లాడుతున్నారు అంటూ సమాచారం వచ్చేది.

క్రమేపి ఈ పరిస్ధితితో  అతనికి భార్యపై అనుమానం పెరగసాగింది.  ఈవిషయమై ఇద్దరి మధ్యతరచూ గొడవ జరగసాగింది. గొడవ జరిగిన ప్రతిసారి ఆమె పుట్టింటికి వెళ్ళపోతోంది. మళ్లీ ఎవరో ఒకరు వచ్చి, దంపతులకు సర్ది చెప్పి కాపురాన్ని నిలబెట్టేవారు. ఈ అనుమానం రానురాను బలపడసాగింది. తాను ఇంట్లో లేని సమయంలో భార్య పరాయి వ్యక్తితో గంటల తరబడి మాట్లాడుతోందనే అనుమానం భర్తకు  బలపడింది.

మార్చి 24 బుధవారం సాయంత్రం, తన పనులు ముగించుకిని ఇంటికి వచ్చిన చిక్కన్నయ్యకు, అతని భార్యతో మళ్లీ ఘర్షణ జరిగింది. తనకు ఎవరితోనూ వివాహేతర సంబంధం లేదని ఆమె ఎంత చెప్పినా వినలేదు, ఆమె మాటలు నమ్మలేదు. రాత్రంతా ఆమెపై ఉన్న అనుమానాలతో  నిద్రకూడా పోలేదు. మనసు మనసులోలేదు. గురువారం తెల్లవారు ఝూమున 3 గంటల సమయంలో కవిత(30) నిద్ర లేచింది.

అప్పుడు మరోసారి భార్యా భర్తల మధ్య ఘర్షణ జరిగింది. వీరి గొడవకు పిల్లలిద్దరూ నిద్రలేచారు. అయినా భార్యా భర్తలు గొడవ ఆపలేదు. అప్పటికే సహనం నశించిన చిక్కన్నయ్య తన పంచెను భార్య మెడకు బిగించి ఊపిరాడకుండా చేసాడు. అది చూసిన పిల్లలు… డాడీ అమ్మను ఏం చెయ్యొద్దు డాడీ ….. ప్లీజ్ అమ్మను వదిలేయ్ డాడీ అంటూ ప్రాధేయ పడ్డారు. అయినా చిక్కన్నయ్యలో ఆవేశం తగ్గలేదు.

కాసేపటికి  కవిత ఊపిరాడక ప్రాణాలు విడిచింది. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న భర్త.. అమ్మ పడుకుందని చెప్పి నమ్మించాడు. వారిని తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. ఉదయం 8గంటల సమయంలో ఇంటి యజమానికి ఫోన్ చేసి భార్యను చంపేశానని, పిల్లలను తీసుకుని వెళ్లిపోతున్నానని చెప్పాడు. యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్ధలానికి వచ్చిన డీఎస్పీ. టూటౌన్ సీఐ, ఇతర సిబ్బంది…కవిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.