Man Looted Cash : స్నేహితుడని ఇంట్లో ఉండమంటే… దోచుకెళ్లాడు

స్నేహితుడని నమ్మి ఇంట్లో ఉండమని చెపితే ఇంట్లో ఉన్న రూ.13.45 లక్షలు తీసుకుని పరారయ్యాడు. రాజస్థాన్ కు చెందిన ఎండీ అజీజ్ తన స్నేహితుడు రాజుఖాన్ తో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం కడ్తా

10TV Telugu News

Man Looted Cash : స్నేహితుడని నమ్మి ఇంట్లో ఉండమని చెపితే ఇంట్లో ఉన్న రూ.13.45 లక్షలు తీసుకుని పరారయ్యాడు. రాజస్థాన్ కు చెందిన ఎండీ అజీజ్ తన స్నేహితుడు రాజుఖాన్ తో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం కడ్తాల్ మండల కేంద్రంలో ఇంజనీరింగ్ వర్క్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.

సెప్టెంబర్ 20న రాజు ఖాన్ ను తన నివాసంలో ఉండమని అజీజ్ షాపుకు  వచ్చాడు. ఇంట్లో ఎవరూలేని సమయంచూసి రాజు ఖాన్ ఇంట్లోని రూ.13.45 లక్షలు దొంగిలించి పరారయ్యాడు. అజీజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : Tiger In Tirumala : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం
రోజుకో ప్రదేశాన్ని మారుస్తూ పోలీసులను ముప్ప తిప్పలుపెట్టిన  రాజుఖాన్ ను ఆదివారం మహత్మాగాంధీ బస్సు స్టెషన్ లో  అరెస్ట్ చేశారు. అతని వద్దనుంచి రూ. 9.90 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

×