Tiger In Tirumala : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం
తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. నిన్న అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో తిరుమల నుంచి తిరుపతికి కారులో వెళుతున్న ప్రయాణికులు వినాయకుడి గుడివద్ద చిరుత సంచర

Tiger In Tirumala Ghat Road
Tiger In Tirumala : తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. నిన్న అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో తిరుమల నుంచి తిరుపతికి కారులో వెళుతున్న ప్రయాణికులు వినాయకుడి గుడివద్ద చిరుత సంచరించటం చూశారు.
వెంటనే వారి సెల్ ఫోన్ లో చిరుతపులి ని షూట్ చేశారు. మార్గంలోని అటవీ శాఖ సిబ్బందికి ఈ విషయం చెప్పారు. అప్రమత్తమైన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోగించి భక్తులను అలర్ట్ చేసారు. అటవీ శాఖ సిబ్బంది చిరుతను అటవీ ప్రాంతంలోకి పంపించే ప్రయత్నం చేసారు.