Murder : దారుణం.. పొట్టిగా ఉందని ఫ్రెండ్స్ హేళన చేయడంతో ప్రియురాలిని చంపేశాడు

ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమకు కులం, మతం లేవంటారు. వయసుతో సంబంధం లేదంటారు. ఎవరు ఎవరిని ఎందుకు ప్రేమిస్తారో తెలీదు. ఏ ఇద్దరి మధ్య ఎప్పుడు చిగురిస్తోంది కూడా తెలీదు. అలా.. ప్రేమ

Murder : దారుణం.. పొట్టిగా ఉందని ఫ్రెండ్స్ హేళన చేయడంతో ప్రియురాలిని చంపేశాడు

Murder

Murder : ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమకు కులం, మతం లేవంటారు. వయసుతో సంబంధం లేదంటారు. ఎవరు ఎవరిని ఎందుకు ప్రేమిస్తారో తెలీదు. ఏ ఇద్దరి మధ్య ఎప్పుడు చిగురిస్తోంది కూడా తెలీదు. అలా.. ప్రేమ మొదలైపోతుంది అంతే. వారి ఇద్దరి మధ్య కూడా అలాగే ప్రేమ చిగురించింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుని హాయిగా సంసారం చేయాలని కలలు కన్నారు. కట్ చేస్తే.. దారుణం జరిగిపోయింది. ప్రియురాలు పొట్టిగా ఉందని ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను నరికి చంపేశాడు.

Sleep : వయస్సుకు తగ్గ నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుందా?..

జార్ఖండ్ లో ఈ దారుణం జరిగింది. అతడి పేరు అజిత్. ఆమె పేరు అంజలి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఆ అమ్మాయి పొట్టిగా ఉంటుంది. అయినా అజిత్ అవేమీ పట్టించుకోలేదు. కాగా, అమ్మాయి పొట్టిగా ఉందని, అలాంటి అమ్మాయిని ఎలా లవ్ చేశావని అజిత్ ఫ్రెండ్స్ హేళన చేసేవారు. దీంతో అజిత్ ఫీల్ అయ్యాడు. అతడిలో మార్పు వచ్చింది. అంజలిపై అతడికి ప్రేమకు బదులు అసహ్యం మొదలైంది. అంతే, ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు.

Exercise : క్యాన్సర్ రోగులు వ్యాయామాలు చేయటం మంచిదేనా?..

పెళ్లి చేసుకుందామని అంజలిని తీసుకెళ్లిన అజిత్ గొడ్డలితో నరికి చంపేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అజిత్ ని తమ స్టైల్ లో ఎంక్వైరీ చేశారు. అంతే, అతడు నిజం కక్కేశాడు. ఫ్రెండ్స్ గేలి చేయడం వల్లే తానే అంజలిని చంపానని ఒప్పుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. షాక్ కి గురి చేసింది. పొట్టిగా ఉందని ఫ్రెండ్స్ హేళన చేస్తే చంపేయడం ఏంటని విస్తుపోతున్నారు. ప్రేమించడానికి ముందు అతడికి ఈ విషయం తెలీదా? అని మండిపడుతున్నారు.