Raped And Harassed : వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం… కాలువలోకి దూకి ఆత్మహత్య

Raped And Harassed : వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం… కాలువలోకి దూకి ఆత్మహత్య

Raped And Harassed

Raped and Harassed : రాజస్ధాన్ లో దారుణం చోటు చేసుకుంది.   వివాహిత మహిళపై కన్నేసిన  ఓ పోలీసు కానిస్టేబుల్  ఆమహిళను  బెదిరించి  కొన్నాళ్లుగా అత్యాచారం చేసి వేధిస్తున్నాడు. తట్టుకోలేని బాధితురాలు కాలవలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు కానిస్టేబుల్ తనపై చేసిన అత్యాచారానికి సంబధించి వివరిస్తూ సెల్పీ వీడియో వైరల్ చేసింది.

రాజస్ధాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లా కరన్ సింగ్ పూర్ లో నివసించే కానిస్టేబుల్ మణిరామ్, స్ధానికంగా ఉండే ముగ్గురు పిల్లల తల్లి అయిన వివాహిత పై కన్నేశాడు. ఆమెను ఎట్టాగైనా  పొందాలనుకున్నాడు.  ఒకసారి ఇంట్లో   ఒంటరిగా ఉన్న సమయం చూసి  ఆ మహిళపై  అత్యాచారం చేశాడు.  మహిళకు తెలియకుండా  ఆమె నగ్న చిత్రాలు తీశాడు. అవి చూపించి తరచూ ఆ మహిళపై లైంగిక దాడి చేస్తున్నాడు. వద్దని వారిస్తే నగ్నఫోటోలు చూపి బెదిరించటం మొదలు  పెట్టాడు.

ఈ బాధ భరించలేని  బాధిత మహిళ కానిస్టేబుల్ భార్య దగ్గరకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. కానీ ఆ ఇల్లాలు భర్తకే వంతపాడింది. తన భర్త ఎప్పుడు కోరితే అప్పుడు ఆయన కోరిక తీర్చమని భర్తనే సపోర్ట్ చేసింది.  ఈ ఘటన తో షాక్ కు గురైన బాధిత మహిళ    ఆత్మహత్య చేసుకోవాలనినిర్ణయించుకుంది.

కానిస్టేబుల్  వేధింపులు భరించలేని మహిళ ముగ్గరు పిల్లల్ని ఒంటరి వారిని చేసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య  చేసుకునే ముందు పోలీసు కానిస్టేబుల్ మణిరామ్ తనపై చేసిన అత్యాచారాన్ని అతని వేధింపులను వివరిస్తూ, అతని భార్య  కానిస్టేబుల్ కు మద్దతు గా మాట్లాడిన విషయాలన్నీ వివరిస్తూ  సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపించింది.

ఈ ఘటనపై మాటిలి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న నిందితుడైన కానిస్టేబుల్ మణిరామ్ ను పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు.