Sidhu Moose Wala: కేంద్ర సంస్థలతో దర్యాప్తు.. అమిత్ షాకు లేఖ రాసిన సిద్ధూ కుటుంబం

సిద్ధూ మూసేవాలా హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గురువారం సిద్ధూ తండ్రిని కలిశారు.

Sidhu Moose Wala: కేంద్ర సంస్థలతో దర్యాప్తు.. అమిత్ షాకు లేఖ రాసిన సిద్ధూ కుటుంబం

Sidhu Moose Wala

Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాలా హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గురువారం సిద్ధూ తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా సిద్ధూ కుటుంబ సభ్యులు అమిత్ షాకు లేఖ రాసినట్లు మంత్రి చెప్పారు.

Caste-based census: బిహార్‌లో కుల గణన.. అఖిల పక్ష సమావేశంలో సీఎం నిర్ణయం

గత ఆదివారం దుండగులు జరిపిన కాల్పుల్లో పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా మరణించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వం భద్రత ఉపసంహరించుకోవడం వల్లే ఈ హత్య జరిగిందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని, అందుకే కేంద్ర సంస్థలే దర్యాప్తు చేయాలని సిద్ధూ కుటుంబ సభ్యులతోపాటు, కాంగ్రెస్ నేతలు కూడా కోరుతున్నారు. పంజాబ్ కాంగ్రెస్ అధినేత అమరిందర్ సింగ్ ఆధ్వర్యంలో బుధవారం గవర్నర్‌ను కలిసి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేలా చూడాలని కోరారు. మరోవైపు సిద్ధూ హత్య జరిగి నాలుగు రోజులు గడిచినా పంజాబ్‌లోని అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ తరఫున ఎవ్వరూ, సిద్దూ కుటుంబ సభ్యులను పరామర్శించలేదు.

PM Modi: “కిచిడీ వండటం మోదీనే నేర్పించారు”

ఎంపీ, మంత్రి ఎవరూ పరామర్శకు రాకపోవడంపై కూడా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పంజాబ్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్‌ను కూడా ఈ కేసులో పోలీసులు విచారిస్తున్నారు.