Murder For Jeans : బాబోయ్.. జీన్స్ ప్యాంట్ వేసుకోవద్దన్న భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

మనుషులు కంట్రోల్ తప్పుతున్నారు. చిన్న చిన్న విషయాలకే మర్డర్లు చేసేస్తున్నారు. కోపంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. జీన్స్ ప్యాంటు ఎందుకు వేసుకున్నావు అని అడిగిన పాపానికి.. ఓ భార్య ఏకంగా తన భర్తనే హత్య చేసింది.

Murder For Jeans : బాబోయ్.. జీన్స్ ప్యాంట్ వేసుకోవద్దన్న భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

Jeans

Murder For Jeans : మనుషులు కంట్రోల్ తప్పుతున్నారు. చిన్న చిన్న విషయాలకే మర్డర్లు చేసేస్తున్నారు. కోపంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. జీన్స్ ప్యాంటు ఎందుకు వేసుకున్నావు అని అడిగిన పాపానికి.. ఓ భార్య ఏకంగా తన భర్తనే హత్య చేసింది. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. పెళ్లి తర్వాత జీన్స్‌ ధరించడానికి ఒప్పుకోలేదని ఓ మహిళ తన భర్తనే కత్తితో పొడిచి చంపేసింది. జార్ఖండ్‌లోని జామ్తారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జోర్భితా గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది.

Uttar Pradesh : సెల్ఫీ మోజులో పొరపాటున రివాల్వర్ పేలి యువకుడు మృతి

పుష్పా హెంబ్రోమ్‌ అనే మహిళ శనివారం రాత్రి జీన్స్ ప్యాంటు ధరించి గోపాల్‌పూర్ గ్రామంలో జరిగే జాతర చూసేందుకు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చాక ఆమె వస్త్రధారణపై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పెళ్లి తర్వాత జీన్స్‌ ఎందుకు ధరించావని భర్త ప్రశ్నించాడు. భర్త అలా ప్రశ్నించడాన్ని భార్య తట్టుకోలేకపోయింది. జీన్స్ ప్యాంటు వేసుకుంటే తప్పేంటి? అనే రీతిలో ఆమె గొడవకు దిగింది.

Crime News: జిమ్ ట్రైన‌ర్‌తో వివాహిత అక్ర‌మ సంబంధం.. అడ్డొస్తున్నాడ‌ని భ‌ర్త‌ను దారుణంగా

ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి గురైన భార్య పుష్ప.. భర్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ధన్‌బాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. తన కొడుకు, కోడలి మధ్య జీన్స్‌ ధరించే విషయంలో గొడవ జరగడంతో.. తన కొడుకుని కత్తితో పొడిచి చంపినట్టు మృతుడి తండ్రి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Teens Kill Boy: టీవీ షో చూసి బాలుడి కిడ్నాప్.. హత్య

జీన్స్ ప్యాంట్ ఆ ఇంట్లో చిచ్చు రాజేసింది. ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ ఘటన స్థానికులను షాక్ కి గురి చేసింది. జీన్స్ ప్యాంట్ ఎంత పని చేసింది అని అంతా తల పట్టుకున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw