YS Sharmila : వైఎస్ షర్మిలపై కేసు నమోదు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన మీడియా సమావేశంతోపాటు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ను దూషించారని ఆయన పేర్కొన్నారు.

YS Sharmila : వైఎస్ షర్మిలపై కేసు నమోదు

YS Sharmila

YS Sharmila Police Case : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ నేత నరేందర్ యాదవ్ మే16న బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

YS Sharmila: అందుకే పేపర్లు లీక్ చేసి అమ్ముకుంటున్నారా?: వైఎస్ షర్మిల

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన మీడియా సమావేశంతోపాటు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ను దూషించారని ఆయన పేర్కొన్నారు. నరేందర్ యాదవ్ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. ఆయన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. 505(2), 504 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.