బతికి ఉండగానే మత గురువుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం

బతికి ఉండగానే మత గురువుకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం
ad

Rajasthanకు చెందిన మతగురువు గురువారం కాలిన గాయాలతో చనిపోయారు. దీనికి కారణం ఓ స్థలం విషయంలో ఓ గ్రూపుకు సంబంధించిన వ్యక్తులు గొడవకు దిగి.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురిని అనుమానించిన పోలీసులు.. ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆ కుటుంబాన్ని అంత్యక్రియలు పూర్తి చేయాలని కోరామని.. చనిపోయిన రెండ్రోజుల వరకూ అలాగే ఉంచడం కరెక్ట్ కాదని సూచించినట్లు కరౌలీ జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఓ ప్రకాశ్ మీనా చెప్పారు. కుటుంబ సభ్యుల డిమాండ్ ల తర్వాత ఎట్టకేలకు మతగురువు అంత్యక్రియలు పూర్తి చేశారు. రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలనేది వారి డిమాండ్.‘నిందితులందరినీ అరెస్ట్ చేయాలి. వారిపై రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వారికి సపోర్ట్ చేస్తున్న పోలీసులపైనా యాక్షన్ తీసుకోవాలి. మాకు రక్షణ కావాలి’ అని మృతుడి బంధువు బాబు లాల్ వైష్ణవ్ కోరుతున్నారు.

జైపూర్ ఎంపీ రామ్ చరణ్ బోరా కూడా ఆ కుటుంబాన్ని కలిసి వారి డిమాండ్ లను అక్కడ అధికార ప్రభుత్వమైన కాంగ్రెస్ కు వినిపిస్తామని హామీ ఇచ్చారు.

ఆ మత గురువుకు గ్రామంలోని రాధాకృష్ణ టెంపుల్ ట్రస్ట్ కు సంబంధించిన 5.2 ఎకరాల స్థలం ఉంది. జైపూర్ కు 177కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థలాన్ని మత గురువుకు ఆధాయ వనరుగా ట్రస్ట్ అప్పగించింది. ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలని భావించారు మతగురువు (బాబూ లాల్). ఆ స్థలాన్ని చదును చేయించి నిర్మాణానికి అణువుగా చేసుకున్నాడు.

అప్పుడే మీనా కమ్యూనిటీకి చెందిన ఓ గ్రూప్ ఎంటర్ అయి ఆ స్థలం తమదేనంటూ గొడవకు దిగారు. గ్రామపెద్దల దగ్గరకు వెళ్లి న్యాయం కావాలని అడిగారు. వారు మతగురువుకే అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ.. నిందితులు వెళ్లి ఆ స్థలంలో గుడిసె వేసేశారు. ఇక్కడే గొడవ పెద్దదైంది.

దాని గురించి మాట్లాడటానికి వెళ్లిన మతగురువుపై ఆరుగురు వ్యక్తులు కలిసి పెట్రోల్ పోశారని కాలిన గాయాలతో స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ట్రీట్‌మెంట్ కోసం జైపూర్ ఎస్ఎమ్ఎస్ హాస్పిటల్ లో అడ్మిట్ చేసినప్పటికీ గురువారం చనిపోయాడు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ లాలా యాదవ్ మాట్లాడుతూ.. పోస్టు మార్టం పూర్తి అయింది. మర్డర్ కేస్ రిజిష్టర్ చేశాం. కైలాష్ మీనాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

మతగురువు చెప్పిన ఆరుగురి పేర్లలో కైలాష్, శంకర్, నమో మీనా మరో ముగ్గురు ఉన్నారు.