Massive Fraud : అధిక వడ్డీల పేరుతో రూ.200 కోట్లు మోసం..బాధితుల్లో టాలీవుడ్ ప్రముఖులు

హైదరాబాద్ నార్సింగిలో అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఓ మహిళ భారీ మోసానికి పాల్పడ్డారు. అధిక వడ్డీల పేరుతో మోసానికి పాల్పడిన శిల్ప చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

10TV Telugu News

Rs 200 crore fraud in Hyderabad : హైదరాబాద్ నార్సింగిలో అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఓ మహిళ భారీ మోసానికి పాల్పడ్డారు. అధిక వడ్డీల పేరుతో మోసానికి పాల్పడిన శిల్ప చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధిక వడ్డీ పేరుతో కోట్లలో డబ్బు తీసుకుని శిల్ప మోసం చేశారు. అధిక వడ్డీలు ఇప్పిస్తామంటూ దాదాపు 200కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బాధితులు నార్సింగి పోలీసులను ఆశ్రయించడంతో శిల్పాచౌదరి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూన్నాయి. ఆమె బాధితుల్లో టాలీవుడ్ నటులు, ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో శిల్ప చౌదరిని, ఆమె భర్తను హైదరాబాద్‌ నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

×