రూ.5.44 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

సూరత్‌లో రూ. 5.44 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పూణే పోలీసులు అరెస్టు చేశారు.

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 06:29 AM IST
రూ.5.44 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

సూరత్‌లో రూ. 5.44 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పూణే పోలీసులు అరెస్టు చేశారు.

సూరత్‌లో రూ. 5.44 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పూణే పోలీసులు శనివారం (డిసెంబర్ 21, 2019) సూరత్‌లో అరెస్టు చేశారు. నిందితులిద్దరూ రాజస్థాన్ నుంచి బస్సులో ప్రయాణిస్తుండగా నియోల్ చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డారు. 

పట్టుబడిన వారిని చునిలాల్ సుతార్, చంద్రకాంత్ షాగా పోలీసులు గుర్తించారు. నిందితుల దగ్గర మొత్తం 642 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటిలో రూ. 2000, రూ. 500,రూ. 200, రూ.100 నోట్లు ఉన్నట్లు వివరించారు.

2019, జూన్ నెలలో ఢిల్లీలో రూ.5 లక్షల నకిలీ నోట్లు పట్టుబడం కలకలం రేపింది. విదేశాల్లో ముద్రించి భారత్‌కు తరలిస్తున్నారని విచారణలో తేలింది. నకిలీ నగదు మార్చేందుకు చూడగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి రూ.5 లక్షల విలువగల రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.2 వేల నోట్ల భద్రతా ప్రమాణాలు .. అచ్చం నిజమైన నోటులాగే ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వాటర్ మార్క్ కూడా చూసి షాక్‌కు గురయ్యారు. అచ్చం నిజమైన రూ.2 వేల నోటులాగా ఉండటంతో అసలైనదా.. నకిలీదా అని నిర్ధారించలేకపోయామని ఓ పోలీసు అధికారి తెలిపారు.