Saidabad Raju Suicide : ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు

ఈ రోజు ఉదయం స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే పట్టాల దగ్గర రాజు మృతదేహం లభ్యమైంది. రైల్వే ట్రాక్‌పై మృతదేహం పడి ఉందని సమాచారం వచ్చింది. లభించిన ఆనవాళ్ల ప్రకారం నిందితుడి చేతిపై మౌనిక అనే..

Saidabad Raju Suicide : ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు

Saidabad Raju Suicide

Saidabad Raju Suicide : హైదరాబాద్ లోని సైదాబాద్‌లో ఆరేళ్ల బాలిక హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారం రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న రాజు గురువారం(సెప్టెంబర్ 16,2021) ఉదయం స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించి రాజు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో రాజు కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించగా, కుటుంబసభ్యులు మాత్రం పోలీసులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజుది ఆత్మహత్య కాదని అంటున్నారు.

Child Family : రాజు మృతదేహాన్ని మాకు అప్పగించాల్సిందే

ఆ భయంతోనే ఆత్మహత్య..
చిన్నారి అత్యాచార, హత్య ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పందించారు. ”ఈ రోజు ఉదయం స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే పట్టాల దగ్గర రాజు మృతదేహం లభ్యమైంది. రైల్వే ట్రాక్‌పై మృతదేహం పడి ఉందని సమాచారం వచ్చింది. లభించిన ఆనవాళ్ల ప్రకారం నిందితుడి చేతిపై మౌనిక అనే టాటూ ఉంది. మరో చేతికి 5 స్టార్ మార్క్‌లు ఉన్నాయి. నిందితుడి కుటుంబసభ్యులు రాజు మృతదేహాన్ని గుర్తించారు. గత 5,6 రోజులుగా రాజు కోసం రాష్ట్రమంతా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోలేనని నిందితుడి మైండ్‌లో పడిపోయింది. ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు” అని సీపీ వెల్లడించారు.

HYD : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య

రైల్వే ట్రాక్ పై డెడ్ బాడీ..
సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు మృతదేహం వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్‌పూర్ దగ్గర రైలు పట్టాలపై కనిపించింది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వారం రోజులుగా రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత రాజు మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

నా కొడుకుది ఆత్మహత్య కాదు..
రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించగా, కుటుంబసభ్యులు మాత్రం పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజుది ఆత్మహత్య కాదని అతడి తల్లి వీరమ్మ అంటోంది. పోలీసులు రాజుని చంపేశారని ఆరోపించింది. మూడు రోజుల కిందటే రాజు దొరికాడని, ఇప్పుడేమో ఆత్మహత్య అంటున్నారని వాపోయింది. పోలీసులు ఉరికించి రాజుని కాల్చి చంపారని ఆమె చెప్పింది. సైదాబాద్ లో రూ.1.50 లక్షలు పెట్టి కొనుకున్న ఇల్లును కూల్చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాలిక తల్లిదండ్రుల కడుపు కాలింది కాబట్టి వారికి న్యాయం చేశారు, ఇప్పుడు నా కొడుకును కూడా చంపారు కదా మాకూ న్యాయం చేయాలి అని ఆమె డిమాండ్ చేసింది.

నా భర్త మంచోడు..
రాజు భార్య మౌనిక సైతం సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తను పోలీసులు తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త మంచోడని, ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదని తెలిపింది. ఒకవేళ నిజంగా తన భర్త తప్పు చేస్తే చట్టపరంగా నిరూపించి శిక్షించాలని, ఇలా చంపేసి
ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం సరికాదని వాపోయింది. తన భర్త ఇన్ని రోజులు పోలీసుల అదుపులోనే ఉన్నాడని, అతడిని చిత్రహింసలకు గురిచేసి చంపేశారని మౌనిక విలపించింది.