Karnataka: తోటి విద్యార్థినిపై హెడ్‭మాస్టర్‭ లైంగిక హింస.. చీపుర్లు, కర్రలతో చితకబాది తగిన బుద్ధి చెప్పిన విద్యార్థినిలు

కట్టేరి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న చిన్మయానంద్ అనే వ్యక్తి, హాస్టల్‌లోని ఒక విద్యార్థినితో దురుసుగా ప్రవర్తించాడు. ఆమెపై దాదాపుగా లైంగిక హింసకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర కోపానికి గురైన మిగతా హాస్టల్ విద్యార్థినిలు.. కర్రలు, చీపుర్లు అందుకుని సదరు ప్రధానోపాధ్యాయుడిపైకి వెళ్లారు. అతడిని చుట్టు ముట్టి చితకబాదారు. విద్యార్థుల దెబ్బలు తాళలేక అతడు గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం వీడియోలో చూడొచ్చు.

School Headmaster Thrashed With Brooms and Sticks for Harassing Girl Student

Karnataka: పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పాడు పనులు చేసినందుకు పెట్టాల్సినంత గట్టి పెట్టారు విద్యార్థినులు. చీపుర్లు, కర్రలతో మూకుమ్మడిగా అతడిపై దాడి చేశారు. ‘ఇక బుద్ధొచ్చింది తల్లో’ అనేంత వరకు చితకబాదారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాకు చెందిన కట్టేరిలోని ఒక ప్రభుత్వ పాఠశాల హాస్టల్‌లో జరిగిన ఘటన ఇది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విడియోను నెటిజెన్లు షేర్ చేస్తూ విద్యార్థినుల ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు.

Surat: పెళ్లి చేసుకొమ్మంటూ ఇబ్బంది పెడుతోందని ప్రియురాలిని ఒడిశా నుంచి గుజరాత్‭కు తీసుకెళ్లి, 49సార్లు…