బెంగళూరు రేవ్ పార్టీకి చిత్తూరుకు లింకేంటి?

రేవ్ పార్టీలో పాల్గొన్నారా? లేదా? డ్రగ్స్ విక్రయించారా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.

బెంగళూరు రేవ్ పార్టీకి చిత్తూరుకు లింకేంటి?

Bengaluru Rave Party : బెంగళూరు రేవ్ పార్టీలో చిత్తూరు మూలాలు బయటపడ్డాయి. పట్టుబడిన వారిలో చిత్తూరుకు చెందిన రణధీర్ విక్రమ్, అరుణ్ కుమార్ ఉన్నారు. రణదీర్ విక్రమ్ డెంటిస్ట్. చిత్తూరు, బెంగళూరు, చెన్నైలో అతడికి ఆస్తులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. చిత్తూరు టీడీపీ నేతలతో రణధీర్ కు పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ నిరోధక చట్టం కింద ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

రేవ్ పార్టీలో పాల్గొన్నారా? లేదా? డ్రగ్స్ విక్రయించారా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎలా వచ్చాయి? అనే కోణంలో విచారణ జరుగుతోంది. అవసరమైతే చిత్తూరు పోలీసుల సహకారం తీసుకోనున్నారు బెంగళూరు పోలీసులు.

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంలో చిత్తూరు మూలాలు బయటపడ్డాయి. బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరిని చిత్తూరు వాసులుగా గుర్తించారు. ఒకరు రణధీర్ విక్రమ్, మరొకరు అరుణ్ కుమార్. రణధీర్ విక్రమ్ ది చిత్తూరు నగరంలో చాలా పలుకుబడిన కుటుంబం. ఆయన తండ్రి కూడా చిత్తూరు వాసులకు సుపరిచితులు. చిత్తూరు, చెన్నై, బెంగళూరులో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. రణధీర్ డెంటిస్ట్ గా పని చేస్తున్నారు. అంతేకాదు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడిన వారిలో రణధీన్, కాణిపాకం ఐరాల మండలానికి చెందిన అరుణ్ కుమార్ ఉన్నారు.

వీరిద్దరూ టికెట్ కొనుక్కోని రేవ్ పార్టీకి వెళ్లారా? లేక ఆ పార్టీలో పట్టుబడిన డ్రగ్స్ ను వీళ్లే సమకూర్చారా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. బెంగళూరు పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఇక, వారిద్దరికీ కూడా చిత్తూరుకు చెందిన పలువురు టీడీపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీల లైఫ్ కు అలవాటు పడ్డ విక్రమ్, అరుణ్.. అలా పార్టీకి వెళ్లార? లేక డ్రగ్స్ విక్రయిస్తుంటారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఇద్దరే డ్రగ్స్ సమకూర్చారా? అన్న కోణంలో బెంగళూరు పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Also Read : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. నటి హేమ బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు