Cyber Attacks on India : సైబర్ క్రైమ్ గ్రూపులకు చైనాతో లింకులు.. 4 నెలల్లో రూ.7వేల కోట్ల స్కామ్

Cyber Attacks on India : దక్షిణాసియా కేంద్రంగా భారత్‌పై విరుచుకుపడుతున్నారు సైబర్ నేరస్తులు. తెలుగువారు సహా అనేకమందికి ఉద్యోగాల పేరుతో ఎరవేసి సైబర్ నేరస్తులుగా మారుస్తున్నారు.

Cyber Attacks on India : సైబర్ క్రైమ్ గ్రూపులకు చైనాతో లింకులు.. 4 నెలల్లో రూ.7వేల కోట్ల స్కామ్

Special Focus on Cyber Attacks on India

Cyber Attacks on India : సైబర్ నేరాలు లెక్కలు.. అవి సాగుతున్న తీరు కలిగిస్తున్న నష్టం.. అందరినీ షాప్ కి గురిచేస్తుంది.. సైబర్ నేరాల వల్ల భారతీయులు నాలుగు నెలల్లో రూ. 7వేల కోట్లకు పైగా కోల్పోయారు. అంతకంటే సంచలనం కలిగిస్తున్న అంశం.. సైబర్ క్రైమ్ గ్రూపులకు చైనాతో లింకులు ఉండటం.. ఏప్రిల్ వరకు 90 వేల స్కామ్‌లు జరిగాయి. దక్షిణాసియా కేంద్రంగా భారత్‌పై విరుచుకుపడుతున్నారు సైబర్ నేరస్తులు. తెలుగువారు సహా అనేకమందికి ఉద్యోగాల పేరుతో ఎరవేసి సైబర్ నేరస్తులుగా మారుస్తున్నారు. అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. సైబర్ నేరస్తుల నుంచి రెండు రోజుల క్రితం తెలుగు వారికి విముక్తి కల్పించారు విశాఖ పోలీసులు. బాధితులను విడతల వారీగా కంబోడియా నుంచి విశాఖకు తీసుకొచ్చారు. ఏజెంట్లు తెలుగువారికి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి కంబోడియా తీసుకెళ్లి అక్కడ చైనా గ్యాంగ్‌కు అప్పగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also : Neuralink Bionic Eyes : చిప్‌తో చూపు.. ఎలన్‌ మస్క్‌ న్యూరాలింక్‌ మరో ఆవిష్కరణ..

దక్షిణాసియా దేశాలే సైబర్ నేరగాళ్ల టార్గెట్ :
ఉద్యోగాల పేరుతో చైనా గ్యాంగ్ బాధితులతో బలవంతంగా సైబలు నేరాలు చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ముగ్గురు స్థానిక ఏజెంట్లను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు తమిళనాడు ఒడిస్సా ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల నుంచి ఇలాగే అనేక మందిని ఉద్యోగాల ఎరవేసి తీసుకెళ్లి సైబరు నేరస్తులుగా మారుస్తున్నారు. కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం సాయంతో మొత్తం 360 మందికిపైగా భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. గతంలో మనదేశానికి సంబంధించిన సైబర్ నేరాల మూలాలు ఇక్కడే వెలుగు చూసేది. జార్ఖండ్‌లోని జామంత్ర హర్యానాలోని మేవాట్ సైబర్ నేరాల కేంద్రాలుగా ఉండేవి. కానీ, ఇప్పుడు మనదేశంలో కన్నా దక్షిణాసియా దేశాలను కేంద్రంగా చేసుకొని మన డబ్బులు దోచుకుంటున్నారు కేటుగాళ్లు.

కంబోడియా, మయన్మార్ వంటి దేశాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ గ్రూపులు నకిలీ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా భారతీయ నిరుద్యోగులకు ఎరవేసి వారిని బెదిరించి బలవంతం చేసి భారతీయ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ గ్రూపుల్లో చాలావరకు గతంలో క్యాసినోలు నిర్వహించేవి. సైబర్ క్రైమ్ గ్రూపుల నిర్వహణలో చైనీయుల పాత్ర ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభిస్తున్నాయి. ఈ గ్రూపులో పనిచేయడంతో పాటు ఈ యాప్‌ల్లో చైనీస్ భాష రాసి ఉంటుంది. భారత్‌కు సైబర్ క్రైమ్ అతిపెద్ద ముప్పుగా మారింది. ఇన్వెస్ట్మెంట్ ట్రెండింగ్ డిజిటల్ అరెస్ట్ డేటింగ్ స్కామ్స్ రూపంలో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. దేశంలో నాలుగు నెలల కాలంలో 85వేల సైబర్ నేరాలు వెలుగు చూశాయి.

భారీగా నమోదైన సైబర్ స్కాములు :
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేట్ సెంటర్ సమాచారం ప్రకారం.. 62,587 ఇన్వెస్ట్మెంట్ల స్కాముల్లో రూ. 1420 కోట్లు, 20,043 ట్రేడింగ్ స్కాముల్లో రూ. 222 కోట్లు, 4600 డిజిటల్ అరెస్టు స్కాంల్లో రూ. 120 కోట్లు, 1725 డేటింగ్ స్కాంల్లో రూ.13 కోట్లను భారతీయులు కోల్పోయారు. గత ఏడాది మొత్తం లక్షకు పైగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు జరిగాయి. సైబర్ నేరాలపై ఆరు లక్షల ఫిర్యాదులు అందాయి. సైబర్ నేరగాళ్ల బారినపడి 7,061 కోట్లు కోల్పోయామని బాధితులు తెలిపారు. పోలీసులు, ఇతర అధికారుల అప్రమత్తతో ఎనిమిది వందల పన్నెండు కోట్ల 7 లక్షల డబ్బును సైబర్ నేరగాళ్ల బారి నుంచి రక్షించారు. ఏడాది కాలంలో 3 లక్షల 25వేల మ్యూల్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. 5,30,000 సిమ్ కార్డులను తొలగించారు. సైబర్ క్రైమ్ గ్రూపులు భారతీయులను టార్గెట్ చేయడానికి భారత్ సిమ్ కార్డులో ఉపయోగిస్తున్నారు. కోల్పోతున్న మొత్తం చాలా ఎక్కువగా ఉంది. పడిన కష్టమంతా నేరగాళ్ల చేతికి చిక్కుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ కాల్స్ వస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త :
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈజీ మనీ ఆన్‌లైన్ టాస్కులు వంటి వాటి జోలికి పోదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకింగ్ స్కాంలు డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డులు పోయినప్పుడు వెంటనే బ్లాక్ చేయించడం. గుర్తుతెలియని మెయిల్స్ నుంచి వచ్చే ఫైల్స్‌ని డౌన్ లోడ్ చేయకుండా ఉండటం, గుర్తు తెలియని ఫోన్ కాల్స్‌కి ఆన్సర్ చేయకపోవడం ద్వారా బారిన పడకుండా తప్పించుకోవచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించకుండా ఉండలేని పరిస్థితుల్లో ఇలాంటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. సైబర్ నేరాలపై గత నెల 30వ తేదీ లోపు ఈ ఏడాది ఏడు లక్షల 40 వేల ఫిర్యాదులు అందాయి. 2019లో ఈ సంఖ్య 26,49 ఉంటే.. 2020 నాటికి 2,57 వేలకు చేరింది. 2021లో నాలుగు లక్షల 52వేల ఫిర్యాదులు, 2022లో 966 వేల ఫిర్యాదులు, గత ఏడాది 15 లక్షల 60 వేల ఫిర్యాదులు అందాయి. దీన్నిబట్టి సైబర్ నేరాలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ లావాదేవీలు పెరిగేకొద్దీ ఫైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి.

Read Also : Prateek Suri Success Story : దుబాయ్‌‌లో మనోడు.. రూ.15వేల కోట్ల వ్యాపారం.. ప్రతీక్ సూరి సక్సెస్ స్టోరీ!