TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మరో ముగ్గురు అరెస్టు

ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ఏఈ, ఏఈఈ పేపర్లను కూడా విక్రయించినట్లు తేలింది. పోటీ పరీక్షలు రాసినవారు, రాస్తున్నవారికి సంబంధించిన లింక్ లపై సిట్ భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మరో ముగ్గురు అరెస్టు

TSPSC Paper Leak (1)

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ వ్యవహారం మలుపులు తిరుగుతూనేవుంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మురం చేసింది. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం మురళీధర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మనోజ్ లను సిట్ అధికారులు అరెస్టు చేశారు.

ప్రవీణ్ నుంచి రూ.10 లక్షలకు ఏఈ పశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించిన అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ఏఈ, ఏఈఈ పేపర్లను కూడా విక్రయించినట్లు తేలింది. పోటీ పరీక్షలు రాసినవారు, రాస్తున్నవారికి సంబంధించిన లింక్ లపై సిట్ భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

TSPSC paper leak: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం

ప్రధాన నిందితుడు ప్రవీణ్ ఏఈ పేపర్ ను రూ.10 లక్షల చొప్పున ఆరుగురికి అమ్మినట్లు గుర్తించారు. గండీడ్ మండలంలో ఇప్పటికే పేపర్ లీకేజీ ప్రధాన సూత్రధారి రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్, సోదరుడు రాజేశ్వర్ నాయక్, గోపాల్, నీలేశ్, శ్రీనివాస్, తిరుపతయ్య, మైబయ్య, జనార్ధన్ లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని వివరాలను సేకరించారు. ఈ నెల మే 5వ తేదీ గండీడ్ మండలం జంగంరెడ్డిపల్లికి చెందిన భగవంత్ కుమార్, అతడి రవి కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.

భగవంత్ కుమార్ వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలో ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రేణుక భర్త డాక్యా నాయక్ భగవంత్ కుమార్ కి సహోద్యోగి. తమ్ముడు రవి కుమార్ కోసం ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసేందుకు భగవంత్ కుమార్ తన ఖాతా నుంచి రూ.లక్షా 75 వేలు బదిలీ చేయడంతో సిట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

High Court : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

డాక్యా నాయక్ స్వస్థలం గండీడ్ మండలం కాగా, పని చేసే ప్రాంతం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం. పేపర్ విక్రయించేందుకు ఈ రెండు మండలాల్లో పరిచయం ఉన్నవారితో బేరాసారాలు చేసినట్లుగా సమాచారం. ప్రవీణ్ ఏఈ, ఏఈఈ పేపర్లను హైదరాబాద్ కు చెందిన మురళీధర్ రెడ్డి, వరంగల్ కు చెందిన మనోజ్ కు విక్రయించినట్లుగా గుర్తించారు.

ఈ ఇద్దరినీ సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రవీణ్, మనోజ్ లు దళారులుగా వ్యవహరించి పేపర్లను పరీక్ష రాసే మరికొందరికి విక్రయించినట్లు తేలడంతో కొనుగోలు చేసినవారి కోసం సిట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.