Son Looted Fathers House : టెక్నాలజీ వాడి తండ్రి ఆస్తి,నగదు కాజేసిన పుత్రరత్నం

ఈ కలికాలంలో డబ్బులు, నగలు, ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు ప్రజలు. ఆఖరికి బంధాలు, బంధుత్వాలు అన్నీ మర్చిపోయి డబ్బే లోకంగా ప్రవర్తిస్తున్నారు.

Son Looted Fathers House : టెక్నాలజీ వాడి తండ్రి ఆస్తి,నగదు కాజేసిన పుత్రరత్నం

Cyber Crime At Karimnagar

Son Looted Fathers House : ఈ కలికాలంలో డబ్బులు, నగలు, ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు ప్రజలు. ఆఖరికి బంధాలు, బంధుత్వాలు అన్నీ మర్చిపోయి డబ్బే లోకంగా ప్రవర్తిస్తున్నారు. కన్నతండ్రి పేరుమీద ఉన్న ఇంటిని, ఇంట్లోని నగదును టెక్నాలజీ ఉపయోంగించి కాజేసిన కొడుకు ఉదంతం కరీనంగర్ లో వెలుగు చూసింది. కరీనంగర్ లో నివసించే వైకుంఠం అనే వ్యక్తికి ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

రెండో కొడుకు రవి కరీంనగర్‌లోనే భార్యతో కలిసి వేరుగా నివసిస్తున్నాడు. స్థిరాస్తులకు సంబంధించిన వైకుంఠానికి ముగ్గురు కుమారులతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇవి పెద్దవిగా మారడంతో తండ్రి వద్ద ఉన్న ఆస్తి,నగదు కాజేయాలని రెండో కొడుకు రవి ప్లాన్ వేశాడు. దీనికి అతడి భార్య కూడా సహకరించింది. ఇందుకోసం టెక్నాలజీ ఉపయోగించుకున్నాడు. వైకుంఠం ఎవరెవరితోమాట్లాడుతున్నాడు. ఏమేం మాట్లాడుతున్నాడు అని తెలుసుకోవడానికి రవి ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్‌ యాప్‌ను వాడాడు.

తండ్రికి తెలియకుండా అదను చూసుకుని వైకుంఠం ఫోన్‌లో దీన్ని ఇన్‌స్టాల్‌ చేశాడు. రికార్డు అయిన ప్రతి కాల్‌ తన ఈ– మెయిల్‌ రూపంలో తన మెయిల్‌ ఐడీకి చేరేలా సింక్‌ చేశాడు. ఇలా తన ఈ– మెయిల్‌ ఐడీకి వస్తున్న ప్రతి కాల్‌ను రెండో కుమారుడు వినేవాడు. వైకుంఠం ఇటీవల హైదరాబాద్‌లోని కుమారుల వద్దకు రావాలని భావించారు. ఈ విషయం వారికి ఫోన్‌లో చెప్పగా… వాళ్లు ఇంటికి, ఇంట్లోని బీరువాకు తాళాలు జాగ్రత్తగా వేసుకుని భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Also Read : Ranga Reddy : ప్రియుడితో కలిసిన తల్లిన చంపిన యువతి

వైకుంఠం ఆ తాళాలను ఫలానా రహస్య ప్రాంతంలో దాచి వస్తానంటూ కొడుకులకు బదులిచ్చాడు. కొడుకులు సూచించిన విధంగా ఇంటికి తాళంవేసి హైదరాహబాద్ చేరుకున్నాడువైకుంఠం. ఈ సంభాషణ మొత్తం ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డర్‌ యాప్‌ ద్వారా రికార్డు కావడంతో పాటు రెండో కుమారుడి మెయిల్‌కు చేరింది. అలా విషయం తెలుసుకున్న రవి, తన భార్యతో కలిసి తండ్రి ఇంటికి వెళ్లాడు. రహస్య ప్రాంతం నుంచి తాళాలు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించారు.

బీరువా తెరిచి అందులోని రూ.25 లక్షల విలువైన నగదు, నగలు, ఆస్తి పత్రాలు కాజేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా యథావిధిగా తాళాలు వేసి ఆ రహస్య ప్రాంతంలోనే పెట్టేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయాడు. హైదరాబాద్‌ వచ్చిన వైకుంఠం కొద్ది రోజులకు కరీంనగర్‌కు తిరిగి వెళ్లారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా.. బీరువాలో ఉండాల్సిన నగదు, బంగారంతో పాటు ఆస్తి పత్రాలు ఆయనకు కనిపించలేదు.

ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరు కొడుకులకు చెప్పి….. అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచించాడు. తన ఫోన్‌ను, అందులోని యాప్స్‌ను నిశితంగా గమనించిన వైకుంఠం.. ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్‌ యాప్‌ ఉండటాన్ని గుర్తించారు. దాన్ని ఓపెన్ చేసి పరీక్ష చేయగా ఆ యాప్ రెండో కొడుకు ఈ– మెయిల్‌ ఐడీతో సింకై ఉన్నట్లు తెలుసుకున్నాడు. తన సంభాషణలు విన్న అతగాడు ఈ పని చేసినట్లు నిర్ధారించుకుని సోమవారం హైదరాబాద్ సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.