Paragliding: ప్రాణాలు తీసిన పారాగ్లైడింగ్.. గుజరాత్‌లో దక్షిణ కొరియా వాసి మృతి, హిమాచల్ ప్రదేశ్‌లో మరొకరు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. రెండు ప్రమాదాలు గత శనివారమే జరిగాయి. మరణించిన వారిలో ఒకరు దక్షిణ కొరియా వాసికాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. రెండో ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది.

Paragliding: ప్రాణాలు తీసిన పారాగ్లైడింగ్.. గుజరాత్‌లో దక్షిణ కొరియా వాసి మృతి, హిమాచల్ ప్రదేశ్‌లో మరొకరు

Paragliding: పారాగ్లైడింగ్ ఇద్దరి ప్రాణాలు తీసింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. రెండు ప్రమాదాలు గత శనివారమే జరిగాయి. మరణించిన వారిలో ఒకరు దక్షిణ కొరియా వాసి. శనివారం సాయంత్రం దక్షిణ కొరియాకు చెందిన షిన్ బియోంగ్ మూన్ అనే వ్యక్తి గుజరాత్, మెహ్సానా జిల్లాలో పారాగ్లైడింగ్ చేస్తున్నాడు.

Nirmala Sitharaman: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

ఈ క్రమంలో గాలిలో ఎగురుతున్నప్పుడు పైన గొడుగులా ఉండే క్యనోపీ సరిగ్గా తెరుచుకోలేదు. దీంతో 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో షిన్ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడి స్నేహితుడు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించాడు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ షిన్ ప్రాణాలు కోల్పోయాడు. అతడి వయసు 50 సంవత్సరాలు. మరో ఘటన కూడా శనివారం సాయంత్రం, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. మహారాష్ట్రకు చెందిన సూరజ్ సంజయ్ షా అనే 30 ఏళ్ల వ్యక్తి, హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. దాదాపు వంద అడుగుల ఎత్తు నుంచి సూరజ్ పారాగ్లైడింగ్ చేస్తూ కింద పడిపోయాడు. దీంతో సూరజ్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఒకే రోజు దేశంలో రెండు పారాగ్లైడింగ్ ప్రమాదాలు జరగడంతో అడ్వెంచరస్ రైడ్ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది.

Bharath ‘Pralay’ Ballistic Missiles : చైనా,పాక్ సరిహద్దుల్లో భారత్ ‘ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు’ .. వీటి రేంజ్ ఎంతంటే..

గతంలో హిమాచల్ ప్రదేశ్‌లో అనేక సార్లు పారాగ్లైడింగ్ కూలిపోయిన పలువురు మరణించారు. దీంతో గత జనవరిలో పారా గ్లైడింగ్‌పై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై ఒక సాంకేతికి కమిటీ ఏర్పాటు చేసి, వాటి పనితీరును పరిశీలించింది. అయితే, చాలా పారాగ్లైడింగ్ యూనిట్స్ ప్రమాణాలకు అనుగుణంగా లేవని, నాసిరకంగా ఉన్నాయని కమిటీ తేల్చింది. ఒకట్రెండు సంస్థలు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి.