Honour Killing : పరువు హత్య కేసులో అన్నకు ఉరి..తండ్రి,ఇద్దరు పోలీసులు సహా 12 మందికి యావజ్జీవం

పరువు పేరుతో తోడబుట్టిన చెల్లిని..ఆమె భర్తను హత్య చేసినందుకు అన్నకు ఉరి, తండ్రికి, ఇద్దరు పోలీసులు సహా 12 మందికి యావజ్జీవం విధించింది కోర్టు.

Honour Killing : పరువు హత్య కేసులో అన్నకు ఉరి..తండ్రి,ఇద్దరు పోలీసులు సహా 12 మందికి యావజ్జీవం

‘honour Killing’ In Tamil Nadu

Honour Killing case..Awards Death Sentence To One Accused : ప్రేమిస్తే కాల్చేస్తాం..తమకు ఇష్టం లేని పెళ్లిచేసుకుంటే వెంటాడి వేటాడి నరికేస్తాం..కడుపులో బిడ్డతో సహా తల్లిని అత్యంత పాశవికంగా చంపేసే విష సంస్కృతిగా ‘పరువు’పేరుతో చేసే హత్యలు ఎంతోమంది కుటుంబాల్లో విషాదాల్నినింపుతున్నాయి. అటువంటి ఓ పరువు హత్య కేసులో మృతురాలి అన్నకు ఉరిశిక్ష, తండ్రికి మరో ఇద్దరు పోలీసులతో సహా 12మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది తమిళనాడులోని కడలూరు కోర్టు. అత్యంత పాశవికంగా కులాంతర వివాహం చేసుకున్న జంటను కిరాతకంగా హత్య చేసినందుకు నిందితులకు కఠిన శిక్ష విధిస్తు సంచలన తీర్పునిచ్చింది కడలూరు కోర్టు. 12మందికి యావజ్జీవ శిక్ష వేసినవారిలో మాజీ డీఎస్సీ కూడా ఉండటం విశేషం.

కులాలు వేరైనా మనసులు కలిశాయి. పెద్దలు అంగీకరిచకపోవడంతో రహస్య వివాహం చేసుకున్నారు. అహం దెబ్బతినడంతో ఇరు కుటుంబాల వారూ కూడబలుక్కుని ఆ జంటను అతి కిరాతకంగా హతమార్చారు. నేరం రుజువుకావడంతో ఒకరికి ఉరిశిక్ష, రిటైర్డ్‌ డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ సహా 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది.

Read more:పరువు హత్య – ప్రియుడితో పారిపోయిన పెళ్లయిన కూతుర్ని హత్య చేసిన తండ్రి

2003లో జరిగిన ఈ దారుణ ఘటన తీర్పు కేసు వివరాల్లోకి వెళితే..తమిళనాడులోని కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని కుప్పందత్తానికి చెందిన స్వామికన్ను 25ఏళ్ల కొడుకు మురుగేశన్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. మురుగేశన్‌ అదే ప్రాంతానికిం చెందిన మరో సామాజిక వర్గానికి అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు కన్నగి. వయస్సు 22ఏళ్లు. కన్నగి తండ్రి దురైస్వామి. ఆమె కూడా మురుగేశన్ ను ప్రేమించింది. ఇద్దరూ మేజర్లే. కానీ ఇద్దరివి వేర్వేరు కులాలు. దీంతో ఇద్దరి కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించలేదు. పెళ్లి పేరు ఎత్తితే నరికి పోగులు పెడతామని కన్నగి కుటుంబంనుంచి హెచ్చరికలు కూడా వచ్చాయి. దీంతో ఒకరినొకరు విడిచి ఉండలేక మురుగేశన్, కన్నగి 2003 మే 5న కడలూరు రిజిస్ట్రార్‌ ఆఫీసులో సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు.

ఈ విషయం ఇరుకుటుంబాలకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. వివాహం జరిగారు ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. కానీ ఎంతకాలం అని ఈ విషయా దాస్తారు? ఈ విషయం తెలిస్తే చంపేస్తారనే భయంతో ఇద్దరు ఓ రోజు ఇంటి నుంచి పారిపోయారు. అలా వెళ్లిపోయిన ఇద్దరు మురుగేశన్‌ తన భార్య కన్నగిని విళుపురం జిల్లాలోని తన బంధువుల ఇంట్లో ఉంచాడు. ఆతరువాత అతను కడలూరు జిల్లాల్లోని తన బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉండేవాడు. కానీ ఈవిషయం కన్నగి ఇంటి సభ్యులు కనిపెట్టారు. వారిని ఎలాగైనా అంతమొందించాలనుకున్నారు.

Read more : తెలంగాణలో మరో ప్రణయ్ దారుణ హత్య, ప్రేమ వ్యవహారమే కారణం

దాంట్లో భాగంగానే..మురుగేశన్‌ బాబాయ్‌ అయ్యాస్వామి సహకారంతో కన్నగి తల్లిదండ్రులు 2003 జూలై 8న ఆమె ఉండే ఇంటికి వెళ్లి మీ పెళ్లిని మేం వ్యతిరేకించం..ఇద్దరు కలిసి మా దగ్గరే ఉందురుగానీ అని నమ్మించి నచ్చచెప్పి ఇద్దరినీ ఇంటికి తెచ్చుకున్నారు. ఆ తరువాత మరికొందరితో కలిసి మురుగేశన్, కన్నగిలను కుప్పందత్తం గ్రామ శివారులోని శ్మశానికి తీసుకెళ్లారు. విషయం అర్థం అయిన మురుగేశన్, కన్నగిలు హడలిపోయారు. అనవసరంగా మారిని నమ్మామని బాధపడ్డారు. తప్పించుకోవటానికి శతవిధాలా యత్నించారు. కానీ కుదరలేదు.

అప్పటికే పక్కా ప్లాన్ వేసుకున్న కన్నగి తండ్రి, అన్నా తాము అనుకున్నది చేయాలనుకున్నారు.దాంట్లో భాగంగానే తమ వెంట ముందుగానే తెచ్చుకున్న విషాన్ని మురుగేశన్, కన్నగి ముక్కు, చెవుల ద్వారా విషాన్ని లోపలికి ప్రవేశపెట్టారు. ఆతరువాత కొద్దిసేపటికే ఇద్దరు చనిపోయారు. వారు చనిపోయారని నిర్ధారించుకున్నతరువాత ఇద్దరి మృతదేహాలను అదే శ్మశానంలో తగులబెట్టారు.

Read more : తీపి గురుతులు : పెళ్లి రోజును గుర్తు చేసుకున్న అమృత ప్రణయ్

ఈక్రమంలో మురుగేశన్‌ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారు దళితులు..కన్నగి కుటుంబం అగ్రకులస్థులు కావటంతో పోలీసులు ఈ దారుణ హత్యల్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఈ విషయం స్థానిక మీడియాలో మార్మోగిపోవడంతో పోలీసులు వేరే దారి లేక కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం రెండు కుంటుంబాలకు చెందిన నలుగురిని అరెస్ట్‌ చేశారు. కానీ దళితులకు న్యాయం జరగదనే ఉద్ధేశంతో దళిత సంఘాలకు చెందినవారు ఈ కేసును సీబీఐకు అప్పగించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో ఈ కేసు 2004లో సీబీఐ చేతుల్లోకి వెళ్లింది.

అలా రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా..అప్పటి విరుదాచలం ఇన్‌స్పెక్టర్‌ చెల్లముత్తు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తమిళ్‌మారన్‌ సహా 15 మందిని నిందితులుగా చేర్చి చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 81 మంది సాక్షులను విచారించగా వీరిలో సెల్వరాజ్‌ అనే సాక్షి ఆత్మహత్య చేసుకున్నాడు. అలా కొనసాగి..పలు మలుపులు తిరిన ఈ కేసులో ఎట్టకేలకు కడలూరు జిల్లా ఎస్సీ ఎస్టీ విభాగం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తమ్‌రాజా ఈ కేసుపై శుక్రవారం (సెప్టెంబర్ 24,2021) సంచలన తీర్పునిచ్చింది.

ప్రధాన నేరస్థుడు కన్నగి అన్న మరుదుపాండికి ఉరిశిక్ష, తండ్రి దురైస్వామి, ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు రంగస్వామి, కందవేలు, జ్యోతి, వెంకటేశన్, మణి, ధనవేల్, అంజాపులి, రామదాస్, చిన్నదురై, తమిళ్‌మారన్, అప్పటి సీఐ చెల్లముత్తు, (ప్రస్తుతం రిటైర్ అయిన డీఎస్పీ), ఎస్‌ఐ తమిళ్‌మారన్‌ (సీఐగా సస్పెన్షన్‌) సహా మొత్తం 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. వీరిలో కన్నగి తండ్రి దురైస్వామి సహా ఐదుగురికి రెండు యావజ్జీవ శిక్షలు విధించగా..15 మంది నిందితుల్లో మురుగేశన్‌ తరఫు అయ్యాస్వామి, గుణశేఖరన్‌లను నిర్దోషులుగా విడిచిపెట్టారు.

tamilnadu :