Telangana: జాతీయ పతాకం ఎగరేస్తూ విద్యుత్ షాక్‌తో ఇద్దరి మృతి

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు.

Telangana: జాతీయ పతాకం ఎగరేస్తూ విద్యుత్ షాక్‌తో ఇద్దరి మృతి

Telangana: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. సోమవారం స్వాతంత్ర వజ్రోత్సవ వేళ జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

PM Modi: స్వాతంత్ర్య వేడుకల్లో ఆసక్తికర దృశ్యం.. చిన్నారుల మధ్య ఉత్సాహంగా గడిపిన మోదీ

పటాన్‌చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్ కుమార్ గౌడ్ (40), తిరుపతి (42) ధనంజయ (38) అనే వ్యక్తులు సోమవారం పతాకావిష్కరణ చేస్తున్నారు. అయితే, జెండాకర్ర.. అక్కడే పైనున్న 11కేవీ విద్యుత్ వైర్లకు తాకింది. ఇది గమనించకుండా జెండా ఎగరేసేందుకు ప్రయత్నించడంతో, జెండా కర్రకు దగ్గరగా ఉన్న మిగతా ఇద్దరికీ విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో అనిల్ కుమార్ గౌడ్, తిరుపతి అక్కడికక్కడే మరణించారు. ధనంజయ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ధనంజయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Mangaluru: గల్‌ఫ్రెండ్‌తో యువకుడి చాటింగ్.. ఆరు గంటలు నిలిచిపోయిన విమానం

ఇద్దరి మృతదేహాల్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబాల్ని పరామర్శించారు.