Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం

ఆ యువతికి ఏదో గాలి సోకిందంటూ నమ్మించిన ఆ బాబా.. వైద్యం చేయాలంటూ ఆ యువతిని నిప్పులపై నిలబెట్టాడు. దీంతో ఆమె కాళ్లకు తీవ్రగాయాలై ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం

Woman (1)

exorcism : మూఢ నమ్మకాలు ప్రాణాలు తీస్తున్నాయి. భూతవైద్యం ప్రాణాలకు మీదికి తెచ్చింది. వికారాబాద్‌ జిల్లా కుక్కింద గ్రామంలో దొంగ బాబాను నమ్మి ఓ యువతి తల్లిదండ్రులు బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టారు. కొద్దిరోజులుగా మతిస్థిమితం సరిగాలేని.. నస్కల్‌ గ్రామంలోని రఫీక్‌ అనే దొంగ బాబా దగ్గరకి భూతవైద్యం కోసం తీసుకెళ్లారు. ఆ యువతికి ఏదో గాలి సోకిందంటూ నమ్మించిన ఆ బాబా.. వైద్యం చేయాలంటూ ఆ యువతిని నిప్పులపై నిలబెట్టాడు. దీంతో ఆమె కాళ్లకు తీవ్రగాయాలై ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Superstitions : ప్రాణాలు తీస్తున్న మూఢ నమ్మకాలు

మరోవైపు ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం చిన్న గొల్లపల్లిలో భక్తి పేరిట మూఢ నమ్మకాలు చిన్న పిల్లల పాలిట శాపంగా మారాయి. లక్ష్మీనరసింహస్వామి తిరునాళ్లలో ఒళ్లుగగుర్పొడిచే మూఢాచారాలను ఇక్కడ భక్తులు అనుసరిస్తున్నారు. తుమ్మ ముళ్ల కంపలను పెద్ద గుట్టగా పేర్చి .. పోతురాజులు వాటి చుట్టూ ప్రదిక్షిణ చేస్తుండగా.. ముళ్లకంపలపై నుంచి పెద్దలు, చిన్నారులను తోసేస్తారు.