Road Accident Three Died : వివాహానికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం.. కారు డివైడర్ ను ఢీకొని ముగ్గురు మృతి

నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Road Accident Three Died : వివాహానికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం.. కారు డివైడర్ ను ఢీకొని ముగ్గురు మృతి

ROAD ACCIDENT

Updated On : January 8, 2023 / 2:36 PM IST

Road Accident Three Died : వివాహానికి వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఖిల్లా బజార్ కు చెందిన కొంతమంది కారులో హైదరాబాద్ లో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్లారు. పెళ్లి వేడుకను హాజరైన అనంతరం వారందరూ కారులో ఖమ్మంకు తిరిగి వస్తున్నారు.

మార్గంమధ్యలో నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని యరసానిగూడెం దగ్గరకు రాగానే వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Cuddalore Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

గాయపడిన వారిని చికిత్స కోసం నార్కట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కట్టంగూరు ఆస్పత్రికి తరలించారు. అయితే కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండంటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.