కావాలనే మర్డర్ చేసి జైలుకెళ్లాడు, రేప్ చేసినోడిని చంపేశాడు.. చెల్లికి అన్యాయం చేసినవాడిపై ప్రతీకారం తీర్చుకున్న అన్న

కావాలనే మర్డర్ చేసి జైలుకెళ్లాడు, రేప్ చేసినోడిని చంపేశాడు.. చెల్లికి అన్యాయం చేసినవాడిపై ప్రతీకారం తీర్చుకున్న అన్న

టైటిల్ చూస్తే సినిమా కథలా అనిపించి ఉండొచ్చు. కానీ ఇది రీల్ స్టోరీ కాదు. రియల్ స్టోరీ. కరుడుకట్టిన తీవ్రవాదులను ఉంచే తీహార్ జైల్లో ఈ ఘటన జరిగింది. తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఆ నరరూప రాక్షసుడిని ఓ అన్న వెంటాడి వేటాడి మరీ హతమార్చాడు. తన మైనర్ సోదరిపై అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమైన వ్యక్తి జైల్లో ఉండగా, అతడిని హతమార్చేందుకు మర్డర్ చేసి మరీ జైలుకెళ్లాడు. అక్కడ ఆ రాక్షసుడి అంతు చూశాడు. దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన సెన్సేషనల్ గా మారింది.

2014లో జాకీర్ చెల్లిపై అత్యాచారం చేసిన మెహతాబ్:
ఢిల్లీలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన జాకీర్(21)కు ఒక్కగానొక్క చెల్లెలు. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. 2014లో దారుణం జరిగిపోయింది. నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన మెహతాబ్(27) జాకీర్ మైనర్ చెల్లిపై అత్యాచారం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మోహతాబ్‌కు శిక్ష పడేలా చేశారు. అతడిని తీహార్ జైలుకి తరలించారు. కాగా, అత్యాచారం ఘటనతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. తనకు జరిగిన అన్యాయాన్ని అన్నకి చెప్పుకుని బోరున విలపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆత్మహత్య చేసుకుంది.

చెల్లి మరణానికి కారణమైన వాడిపై పగ పెంచుకున్న అన్న:
పోలీసులు మెహతాబ్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపినా.. సోదరి మరణాన్ని అన్న జాకీర్ తట్టుకోలేకపోయాడు. తన చెల్లెలిని రేప్ చేసి, మరణానికి కారణమైన మెహతాబ్‌ పై పగ, ప్రతీకారం పెంచుకున్నాడు. తన చెల్లికి తీరని అన్యాయం చేసిన ఆ నరరూప రాక్షుసుడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ… మెహతాబ్ రేప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. దీంతో అతడిని ఎలా చంపాలో అర్థం కాలేదు. సరైన అవకాశం కోసం ఎదురుచూశాడు. ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి. ప్రతి రోజూ… అదే ఆలోచన. ఇలా ఏళ్లు గడిచాయి. జాకీర్ మైనర్ నుంచి మేజర్ అయ్యాడు. పక్కా ప్రణాళికను రచించాడు.

తీహార్ జైలుకి వెళ్లేందుకు మర్డర్ చేసిన జాకీర్:
తీహార్ జైల్లోనే మెహతాబ్‌ను మర్డర్ చేయాలని జాకీర్ డిసైడ్ అయ్యాడు. అయితే ఆ జైల్లోకి ఎంటర్ కావాలంటే తానూ ఓ నేరం చేయాల్సిందే అని తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ నేరం చేశాడు. 2018 జులైలో కావాలనే రిక్షా డ్రైవర్ ను హత్య చేసి అరెస్ట్ అయ్యాడు. అప్పుడు జాకీర్ వయసు 20 ఏళ్లు. పోలీసులు అతన్ని కూడా తీహార్ జైలుకి తరలించారు. అయితే మెహతాబ్ ఉంటున్న వార్డు.. జాకీర్ ఉంటున్న వార్డు వేర్వేరు. క్రూరమైన, తీవ్రమైన నేరం చేసిన వారిని ఉంచే వార్డులో మెహతాబ్ ను పోలీసులు ఉంచారు. జాకీర్ వయసు 20 ఏళ్లే కావడంతో పోలీసులు అతడిని వేరే వార్డులో ఉంచారు. దీంతో జాకీర్ సమయం కోసం వేచి ఉన్నాడు. ఇలా మరో ఏడాది గడిచింది. జాకీర్ కి 21 ఏళ్లు వచ్చాయి. దీంతో అతడిని మెహతాబ్ ను ఉంచిన వార్డు సమీపంలోని వార్డులోకి షిఫ్ట్ చేశారు.

పథకం ప్రకారమే తోటి ఖైదీలపై దాడి:
ఎలాగైనా మెహతాబ్ ఉంటున్న వార్డులోకి వెళ్లేందుకు జాకీర్ మరో ప్లాన్ వేశాడు. తన వార్డులో ఉన్న తోటి ఖైదీలపై దాడి చేశాడు. జాకీర్ వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. జాకీర్ ను క్రూరమైన, తీవ్ర ఖైదీగా జైలు అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని మెహతాబ్ వార్డులోకి మార్చారు. దీంతో జాకీర్ చాలా ఆనందించాడు. తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని సంబరపడ్డాడు. అక్కడ తన శత్రువుని చూసిన జాకీర్ తెగ ఖుషీ అయ్యాడు. ప్రతీకారంతో రగిలిపోయాడు. ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురుచూశాడు. ఇంతలో ఓ పదునై ఆయుధాన్ని(మెటల్ స్ట్రిప్) కూడా సంపాదించాడు. ఈ క్రమంలో జూన్ 27న ఉదయాన ఖైదీలంతా ప్రార్థనలు చేసే సమయంలో మెహతాబ్‌ పై జాకీర్ దాడి చేశాడు. అతడిని కసితీరా కసాకసా పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మెహతాబ్‌ను జైలు అధికారులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. ఇలా తన చెల్లెలికి జరిగిన అన్యాయానికి ఓ అన్న పగ తీర్చుకున్నాడు.

ఆ నరరూప రాక్షసుడిని చంపి పగ తీర్చుకున్నా:
జాకీర్ తీరుతో పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఎందుకిలా చేశావని ప్రశ్నించగా, జాకీర్ చెప్పిన సమాధానం విని వారు మరింత విస్తుపోయారు. “పగ తీర్చుకున్నా” అని జాకీర్ చెప్పాడు. ఏంటా పగ అని పోలీసులు అడిగితే… అసలు విషయం చెప్పాడు జాకీర్. ఇప్పుడు నా చేతిలో చచ్చిన మెహతాబ్… 2014లో తన సోదరిని రేప్ చేశాడని, ఆమె మరణానికి కారణం అయ్యాడని తెలిపాడు. తన చెల్లి మరణానికి కారణమైన ఆ నరరూప రాక్షసుడిని జైల్లోనే చంపి ప్రతీకారం తీర్చుకున్నా అని జాకీర్ చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు.

చెల్లికి అన్యాయం చేసినోడిపై ప్రతీకారం తీర్చుకున్న అన్న:
పథకం ప్రకారమే జాకీర్ ఓ మర్డర్ చేసి జైలుకి వచ్చాడని, ప్రణాళిక ప్రకారమే జైల్లో తోటి ఖైదీలతో గొడవ పడి మెహతాబ్ ఉంటున్న వార్డులోకి మారాడని తెలిసి పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది. కాగా ఈ రియల్ రివెంజ్ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చెల్లికి అన్యాయం చేసిన వాడిపై ప్రతీకారం తీర్చుకున్న ఆ అన్న ఇప్పుడు హీరో అయ్యాడు. అన్న అంటే ఇలా ఉండాలి, శభాష్ జాకీర్ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Read:టాప్-12 ఉగ్రవాదుల కొత్త హిట్ లిస్ట్