Tollywood Drugs Case : ముగిసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ?

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ముగిసిపోయినట్లేనా...? సెలబ్రిటీలందరికీ క్లీన్‌చిట్‌ ఇచ్చేసినట్లేనా...? డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం అస్సలు పనికిరాదా..?

Tollywood Drugs Case : ముగిసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ?

Tollywood Drugs Case

Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ముగిసిపోయినట్లేనా…? సెలబ్రిటీలందరికీ క్లీన్‌చిట్‌ ఇచ్చేసినట్లేనా…? డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం అస్సలు పనికిరాదా..? ఈడీ విచారణ జరుగుతున్న సమయంలో.. ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోని అంశాలు కొత్త ట్విస్ట్ ఇచ్చాయి…

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటులకు క్లీన్ చిట్ ఇచ్చేసింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. కెల్విన్‌పై దాఖలు చేసిన ఛార్జ్ షీ‌ట్‌లో కీలక అంశాలు ప్రస్తావించింది. సినీనటుల విచారణ గురించి ప్రస్తావించిన ఎక్సైజ్ శాఖ .. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తేల్చేసింది. సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చాడని.. సిట్ బృందం పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించిందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. అన్ని రకాల సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించిందని.. సెలబ్రిటీలపై బలమైన తగిన ఆధారాలు లభించలేదని వెల్లడించింది.
Also Read : Father Tortured Girl Child : వీడు తండ్రేనా-కన్నకూతురిని దారుణంగా హింసించాడు

సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని.. సెలబ్రిటీలపై కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పు దోవపట్టించేలా ఉన్నాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేమని.. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదని పేర్కొంది. సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ కూడా లభించలేదని.. పూరి జగన్నాథ్, తరుణ్ స్వచ్ఛందంగా బయో శాంపిల్స్ కూడా ఇచ్చారని పేర్కొంది. పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ తేల్చిందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.

Also Read : Road Accident : కాలువలోకి దూసుకెళ్ళిన కారు.. ఇద్దరు మృతి

ఇక ఈ ఛార్జిషీట్‌లో కెల్విన్ చరిత్రను కూడా ఎక్సైజ్ శాఖ ప్రస్తావించింది. మంగళూరులో చదువుకునేటప్పుడు కెల్విన్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని తెలిపింది. 2013 నుంచి తన స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడని.. గోవా, విదేశాల నుంచి డార్క్ వెబ్ ద్వారా కెల్విన్ డ్రగ్స్ తెప్పించాడని ఛార్జిషిట్‌లో ఎక్సైజ్ శాఖ ప్రస్తావించింది. వాట్సాప్, మెయిల్ ద్వారా ఆర్డర్లు తీసుకుని డ్రగ్స్ సరఫరా చేసేవాడని.. సోదాల సమయంలో కెల్విన్ పారిపోయేందుకు ప్రయత్నించాడని ఛార్జిషీట్‌లో తెలిపింది.

2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని ఎక్సైజ్‌శాఖ చెబుతున్నప్పటికీ.. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ‌విచారణ చేపడుతోంది. ఆ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ సమయంలో ఎక్సైజ్ శాఖ ఛార్జ్‌షీట్ బయటకు వచ్చింది. అందులోని అంశాలు చూస్తుంటే నటులకు ప్రమేయం లేదని చెప్పడం ద్వారా.. ఇక కేసును దాదాపుగా క్లోజ్ చేసినట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.