Tammineni Krishnaiah : టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ఖమ్మం టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. కృష్ణయ్య హత్యకు కోటేశ్వరరావు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 6 నెలల వ్యవధిలో రెండుసార్లు కృష్ణయ్యపై హత్యాయత్నం జరిగిందని

Tammineni Krishnaiah : టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Tammineni Krishnaiah : ఖమ్మం టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. కృష్ణయ్య హత్యకు కోటేశ్వరరావు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 6 నెలల వ్యవధిలో రెండుసార్లు కృష్ణయ్యపై హత్యాయత్నం జరిగిందని, వారికి ఆయుధాలను కోటేశ్వరరావు సమకూర్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. తమ్మినేని కృష్ణయ్య హత్య తర్వాత నిందితులకు కోటేశ్వరరావు రూ.50వేలు పంపినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు పోలీసులు. కత్తులు కొనేందుకు కోటేశ్వరరావు రూ.3వేలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఆగస్టు 15న తమ్మినేని కృష్ణయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. దోబీఘాట్ దగ్గర బైక్ పై వెళ్తున్న కృష్ణయ్యను ఆటోతో ఢీకొట్టి దాడికి దిగారు నిందితులు. కిందపడిపోయిన తమ్మినేని కృష్ణయ్యను కత్తులతో పొడిచి అతి కిరాతకంగా మర్డర్ చేశారు.

తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో తమ్మినేని కోటేశ్వరరావే కీలకంగా వ్యవహరించినట్లుగా చెబుతూ పోలీసులు 24 పేజీల రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. ఈ కేసులో ఏ1,ఏ2,ఏ3,ఏ4 ఉన్న నిందితులు ఆరు నెలల క్రితమే కృష్ణయ్య హత్యకు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆయుధాల కొనుగోలు కోసం తమ్మినేని కోటేశ్వరరావే డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 8మందిని పోలీసులు రిమాండ్ చేశారు.

మరో ఇద్దరు కోటేశ్వరరావు, ఎల్లంపల్లి నాగేశ్వరరావు పరారీలో ఉన్నారు. వారిద్దరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రిమాండ్ రిపోర్టులో కోటేశ్వరరావు పేరు లేదని కృష్ణయ్య కుటుంబసభ్యులు నిన్నటివరకు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. కాగా, తాజాగా పోలీసులు తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో కోటేశ్వరరావు పేరును చేర్చారు. కృష్ణయ్య హత్య కేసులో కోటేశ్వరరావు కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించిన పోలీసులు.. అందుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా సేకరించారు.

తన తండ్రి హత్య కేసులో ప్రధాన నిందితులైన కోటేశ్వరరావు, లింగయ్యను పోలీసులే దాచిపెట్టారని కృష్ణయ్య కూతురు రజిత ఆరోపించారు. తన తండ్రిని చంపిన హంతకులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వేడుకున్నారు.