టీఆర్ఎస్ నేతను కొట్టి చంపారు

సూర్యపేట జిల్లాలో సహకార ఎన్నికల వేళ మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురయ్యారు.

  • Published By: veegamteam ,Published On : February 15, 2020 / 04:25 AM IST
టీఆర్ఎస్ నేతను కొట్టి చంపారు

సూర్యపేట జిల్లాలో సహకార ఎన్నికల వేళ మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురయ్యారు.

సూర్యపేట జిల్లాలో సహకార ఎన్నికల వేళ మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురయ్యారు. ఎర్కారం టీఆర్ఎస్ నేత వెంకన్నను హత్య చేశారు. సహకార ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో వెంకన్నను కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో కొట్టి చంపినట్లు సమాచారం 

సహకార ఎన్నికల విషయంపై ఎర్కారం గ్రామంలో రెండు రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గ్రామ మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు శుక్రవారం (ఫిబ్రవరి 14, 2020) అర్ధరాత్రి హత్య చేశారు. సహకార సంఘ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా కార్యకర్తలతో మాట్లాడుతున్న వెంకన్నపై ప్రత్యర్థులు దాడి చేశారు. తల్వార్లు, గొడ్డళ్లతో ఆయనను వెంబడించారు. ప్రాణభయంతో పరుగులు పెట్టిన వెంకన్న ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. అయినా ప్రత్యర్థులు తలుపులు పగులగొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. 

సమాచారం అందుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. వెంకన్న హత్యపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.

కాగా, వెంకన్న హత్యతో గ్రామంలో ఫ్యాక్షన్ హత్యలు మరోసారి మొదలయ్యాయి. పదిహేనేళ్ల కిందట ఇదే విధంగా గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్‌ను హత్య చేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. వెంకన్న హత్యతో దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 
 

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు