Multi-level Marketing: మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల పట్ల ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హెచ్చరిక

దేశంలో క్యూనెట్ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు రాజేష్ కన్నాతో సహా ముగ్గురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వప్న లోక్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క్యూనెట్ ఆరుగురు అమాయకపు యువకులను పొట్టనబెట్టుకుంది.

Multi-level Marketing: మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల పట్ల ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హెచ్చరిక

TSRTC MD Sajjanar: మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు. తాజాగా మల్లీలెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు రాజేష్ కన్నాతో సహా ముగ్గురిని అరెస్ట్ చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇలాంటి మోసాలకు గురికావద్దని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఆర్గనైజర్లతో పాటు ఏజెంట్లనూ లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీస్ అరెస్ట్ చెయ్యాలని, మోసపూరిత క్యూనెట్ కంపెనీ కార్యకలపాలపై సమగ్ర విచారణ జరపాలని, ఆ సంస్థను తక్షణం మూసివేసి ఆస్తులన్నీ జప్తు చేయాలని ఆయన కోరారు.

Vande Bharat Train: దారుణంగా విఫలమైన కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. టార్గెట్ 32 వందేభారత్ రైళ్లైతే ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు

‘‘దేశంలో క్యూనెట్ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు రాజేష్ కన్నాతో సహా ముగ్గురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వప్న లోక్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ క్యూనెట్ ఆరుగురు అమాయకపు యువకులను పొట్టనబెట్టుకుంది. ఈ వ్యవహారంలో ఆర్గనైజర్లతో పాటు ఏజెంట్లనూ లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీస్ అరెస్ట్ చేయాలి. మోసపూరిత క్యూనెట్ కంపెనీ కార్యకలపాలపై సమగ్ర విచారణ జరపాలి. ఆ సంస్థను తక్షణం మూసివేసి ఆస్తులన్నీ జప్తు చేయాలి. గొలుసు కట్టు పద్ధతిలో అమాయకులను టార్గెట్ చేసుకుని..మోసం చేస్తున్న మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.