Police Torture : అరాచకం-యువకుడి మలద్వారంలో లాఠీ దూర్చి,కరెంట్ షాకిచ్చిన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరాచకం పెచ్చుమీరిపోయింది. గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అదుపులోకి తీసుకున్న యువకుడి మలద్వారంలో లాఠీ దూర్చి, కరెంట్ షాకిచ్చారు.

Police Torture : అరాచకం-యువకుడి మలద్వారంలో లాఠీ దూర్చి,కరెంట్ షాకిచ్చిన పోలీసులు

Uttar Pradesh Constable

Police Torture :  ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరాచకం పెచ్చుమీరిపోయింది. గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అదుపులోకి తీసుకున్న యువకుడి మలద్వారంలో లాఠీ దూర్చి, కరెంట్ షాకిచ్చారు. యువకుడి ఆరోగ్య పరిస్ధితి విషమించటంతో లంచం తీసుకుని విడిచిపెట్టిన ఘటన చోటు చేసుకుంది.

బదౌయూ జిల్లాలోని అలహాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే యూనిస్ ఆలీ కుమారుడు రెహాన్(20)‌ను కక్రాలా పోలీసు ఔట్ పోస్టు పోలీసులు జూన్2 న అదుపులోకి తీసుకున్నారు. కూరగాయల షాపులో పని చేసి తిరిగి ఇంటికి వస్తుండగా అతడిని పట్టుకున్నారు.

స్టేషన్ లో అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అతనికి కరెంట్ షాకిచ్చారు. మలద్వారంలో లాఠీ దూర్చి దారుణంగా కొట్టారు. పోలీసు దెబ్బలకు యువకుడి ఆరోగ్య పరిస్ధితి విషమించింది. గోహత్యలు చేసే గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో రెహాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సమాచారం తెలుసుకుని రెహాన్ కుటుంబ సభ్యులు పోలీసు ఔట్ పోస్టు వద్దకు రాగా వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని విడుదల చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

రెహాన్ ను వెంటనే స్ధానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదుచేయగా ఆయన కేసు నమోదు చేయించి విచారణ జరిపించారు. నిందితులైన ఐదుగురు పోలీసులపై ఐపీసీ సెక్షన్ 342, 323 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈసందర్భంగా ఏఎస్పీ ప్రవీణ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ… నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని…. ఐదుగురు పోలీసులపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలిందని చెప్పారు. వారిని సస్పెండ్ చేయటానికి శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేసు తదుపరి విచారణను డేటాగంజ్ సీఓ ప్రేమ్ కుమార్ థాపాకు అప్పగించామని ఆయన చెప్పారు.

Also Read : Khammam : పెళ్లైన రెండు రోజులకే వరుడు అనుమానాస్పద మృతి