Hyderabad Crime: బంజారా‌హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. వాచ్‌మెన్ మృతి

చెన్నైకి చెందిన నలుగు డ్యాన్సర్లు మద్యం మత్తులో నెట్టివేయడంతో వాచ్‌మెన్ మరణించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Hyderabad Crime: బంజారా‌హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. వాచ్‌మెన్ మృతి

Watchman died

Hyderabad Crime : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో నలుగురు డ్యాన్సర్లు వాచ్‌మెన్‌ను నెట్టివేయడంతో బిల్డింగ్‌పై నుంచి పడి అతను మరణించిన ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని యూసుఫ్ గూడ కృష్ణానగర్‌లో స్పైసీ రెస్టారెంట్ బిల్డింగ్‌లో‌ఉన్న రాఘవ గెస్ట్‌హౌస్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈనెల 20న షూటింగ్ నిమిత్తం చెన్నై నుంచి వచ్చిన నలుగురు డ్యాన్స్‌ర్లు బిల్డింగ్‌లోని నాలుగో ఫ్లోర్‌లో రూం బుక్ చేసుకున్నారు.

Intermediate Board: విద్యార్థి మానేస్తే ఫీజు తిరిగి ఇవ్వాల్సిందే.. 8 గంటలు నిద్ర మస్ట్.. ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు మార్గదర్శకాలు జారీ

గురువారం అర్థరాత్రి సమయంలో నలుగురు డ్యాన్సర్లు మద్యం మత్తులో హోటల్ సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఈ విషయాన్ని సిబ్బంది వాచ్‌మెన్ యాదగిరికి తెలియజేశారు. యాదగిరి వచ్చి వారిని అదుపు చేసే క్రమంలో డ్యాన్సర్లకు యాదగిరికి వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న డ్యాన్సర్లు యాదగిరిని నెట్టివేయడంతో బిల్డింగ్ పైనుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఇద్దరు డాన్సర్లని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు డ్యాన్సర్లు పరారీలో ఉండటంతో వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Lightening Strike : షాకింగ్ వీడియో.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పిడుగు, అక్కడికక్కడే మృతి

బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని యాదగిరి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ పరిశీలించారు. క్లూస్ టీం కూడా ఘటన స్థలాన్ని పరిశీలించింది. మృతుడిది వరంగల్ జిల్లాగా పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి ఇద్దరు డ్యాన్సర్లను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం వారిని కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు మణికంఠ అనే డ్యాన్సర్‌ RRR మూవీ‌లో సైడ్ డ్యాన్సర్‌గా చేశాడు. కొన్ని చిత్రాలకు సైడ్ డ్యాన్సర్‌గా వ్యవహరించాడు.