MLA Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కేకలు వేయటంతో నిందితుడు పారిపోయాడు

ఆర్మూర్ ఎమ్మెల్యే  జీవన్​రెడ్డిపై హత్యాయత్నం కేసులో  పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.

MLA Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కేకలు వేయటంతో నిందితుడు పారిపోయాడు

joyal devis

MLA Jeevan Reddy :  ఆర్మూర్ ఎమ్మెల్యే  జీవన్​రెడ్డిపై హత్యాయత్నం కేసులో  పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితుడు ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యేను చంపేందుకే వచ్చాడని వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ వెల్లడించారు.  దీనికోసం రెండు నెలల నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని ఆయన అన్నారు.  ఈరోజు హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ ప్రసాద్ గౌడ్‌కు ఆయుధాలు సమకూర్చిన వారి సమాచారం కూడా సేకరించామని వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పిన వివరాల ప్రకారం…. నిజామాబాద్ జిల్లా కల్లాడి గ్రామానికి చెందిన పెద్దగాని ప్రసాద్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ లీడర్. అతని భార్య లావణ్య కల్లాడి సర్పంచ్‌గా పని చేస్తోంది.  గ్రామ అభివృద్ధి పనులు అన్ని ప్రసాద్ చూసుకుంటున్నాడు.   20 లక్షలు తన సొంతానికి వాడుకోవడంతో  2022 ఫిబ్రవరి నెల లో కలెక్టర్ అతని భార్యను సస్పెండ్ చేసింది.

తన భార్య సస్పెండ్  కావడానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారణమని అతనిపై కక్ష పెంచుకొని హత్యాయత్నం చేయడానికి  ప్రసాద్  ప్లాన్ చేశాడు. మహారాష్ట్రలో కత్తి ని కొనుగోలు చేశాడు. సంతోష్ సహకారంతో ముస్తఫా ఆర్మ్స్   నాంపల్లి వద్ద ఎయిర్ పిస్టల్ కొనుగోలు  చేశాడు. నిజామాబాద్ కు  చెందిన సుగుణ, సురేందర్ సహకారంతో బీహార్ కు చెందిన మున్నా కుమార్ వద్ద   రూ.60,000 కు కంట్రీ మెడ్ పిస్టల్ కొనుగోలు చేశాడు. సాగర్ సహకారంతో బీహార్ ముజాఫర్ లో బుల్లెట్లు కొనుగోలు చేశాడు.

ఆగస్టు 1వతేదీ సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని  ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటికి ప్రసాద్ చేరుకున్నాడు. ఎమ్మెల్యే మూడో ఫ్లోర్ లో ఉన్నాడని అతడి పని మనిషి గంగాధర్ చెప్పడంతో అతని వద్దకు వెళ్లి ఎయిర్ పిస్టల్  కత్తి   బయటకు తీశాడు.   ఇది గమనించి  ఎమ్మెల్యే   జీవన్ రెడ్డి గట్టిగా  అరవడంతో ఎమ్మెల్యే సిబ్బంది అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి అతను పారిపోయాయడన్నారు  వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డేవిస్.

నిందితుడు ప్రసాద్ పై గతంలో ఎంపీడీవో పై దాడి చేసిన కేసుతో పాటు ఐదు కేసులు ఉన్నాయని డిసిపి వివరించారు. నిందితుడి నుంచి ఎయిర్ పిస్టల్, ఎయిర్ రిఫ్లే పిళ్లెట్స్ బాక్స్3, కంట్రీ మెడ్ గన్, కత్తి స్వాధీనం చేస్తుకున్నామని డీసీపీ చెప్పారు.  ఈ హత్యాయత్నం కేసులో ఇంకా ఎవరి ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో కూడా చారణ చేస్తున్నామని ఆయన తెలిపారు.

Also Read : Viral Video : రాజకీయ నాయకుడి కారుని ఈడ్చుకెళ్లిన లారీ