Extra Marital Affair : బంధువుతో వివాహేతర సంబంధం-భర్త హత్య

కామంతో కళ్లు మూసుకుపోయి బంధాలకు తిలోదకాలిచ్చి వివాహేతర సంబంధాలపై మోజు పెంచుకుంటున్నారు కొందరు. 

Extra Marital Affair : బంధువుతో వివాహేతర సంబంధం-భర్త హత్య

Extra Marital Affair

Extra Marital Affair :  కామంతో కళ్లు మూసుకుపోయి బంధాలకు తిలోదకాలిచ్చి వివాహేతర సంబంధాలపై మోజు పెంచుకుంటున్నారు కొందరు.  వరసకు బాబాయ్ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను హతమార్చిన మహిళను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

వైరా  సీఐ సంపత్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం… ఫిబ్రవరి 26న కుర్నవల్లి దళిత వాడలో జయరాం(పేరు మార్చాము) అనే వ్యక్తి  హత్య జరిగింది.  అతడి భార్యే రోకలి బండతో కొట్టి చంపినట్లుగా నేరం అంగీకరించింది. నిత్యం తాగివచ్చి తనను కొడుతూ ఉండటం…వేధిస్తూ ఉండటంతో  హత్య చేసినట్లు పోలీసులకు తెలిపింది.

కేసు  నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేయగా కొత్త విషయాలు వెలుగులోకి  వచ్చాయి. ఆమె వరసకు బాబాయ్ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం  పెట్టుకుంది.  ఆమె బాబాయ్ కల్లూరు మండలం చిన్న కొరుకొండిలో నివసిస్తున్నాడు.  ఫిబ్రవరి 26న జయరాం మద్యం సేవించి ఇంటికి వచ్చే సరికి అతని భార్య, ఆమె బాబాయ్ ఇద్దరూ కలిసి ఉండగా జయరాం చూశాడు.

కోపంతో భార్యతో గొడవ పడ్డాడు. ఈక్రమంలో ఆమె బాబాయ్ జయంరాం ను తన్నడంతో కింద పడిపోయాడు. ఆ వెంటనే ఆమె పక్కేనే ఉన్న రోకలి బండ తీసుకుని భర్త  తలపై కోట్టింది.  దీంతో జయరాం స్పృహ తప్పి పడిపోయాడు.
Read Also  :TRS : మహిళాబంధు సంబురాలు షురూ.. మూడు రోజులు సెలబ్రేషన్స్
ఆమె బాబాయ్ జయరాం కాళ్లు గట్టిగా పట్టుకోగా,  ఆమె భర్త  నోటిలో దుప్పటి కుక్కి ఊపిరాడకుండా  చేసింది. దీంతో జయరాం మరణించాడు. ఈవిషయాలన్నీవిచారణలో తేలటంతో ఇద్దరినీ మధిర కోర్టులో హజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.