Tamil Nadu: చీట్ చేసిన బాయ్ ఫ్రెండ్ మీద వేడి నూనె పోసిన యువతి
నేపథ్యంలో శనివారం ఈ ఇద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య మళ్లీ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో మీన వేడి నూనె తీసి కార్తీపై చల్లింది. చేతులు, ముఖం కాలిపోయి కార్తీ కిందపడిపోయాడు. తీవ్రంగా గాయాలైన అతడిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మీనాను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

woman pours hot oil on boyfriend after he cheats on her
Tamil Nadu: తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి చీట్ చేసిన బాయ్ ఫ్రెండ్ మీద వేడి నూనె పోసింది ఒక యువతి. ఈ ఘటనలో బాధితుడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. సదరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వారు తెలిపారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగిందీ సంఘటన.
NIA raids: మంగళూరు, కొయంబత్తూరు పేలుళ్ల కేసులో మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎన్ఐఏ సోదాలు
బాధితుడి పేరు కార్తి, నిందితురాలి పేరు మీనా దేవి. భవాని ప్రాంతంలోని వర్ణపురం గ్రామానికి చెందిన కార్తీ, పెరుందురై అనే ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతడు మీనాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ మాటతో ఇద్దరు రిలేషన్‌షిప్‌లోకి వెళ్లారు. అయితే కార్తీ వేరే ఇంకెవరితోనో పెళ్లికి సిద్ధమవుతున్నాడని, ఎంగేజ్మెంట్ కూడా అవుతోందని మీనాకు తెలిసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు తలెత్తాయి.
ADR Report: 7 పార్టీలకు అందిన 66 శాతం విరాళాలు గుర్తు తెలియని మూలాల నుంచి వచ్చాయట
ఈ నేపథ్యంలో శనివారం ఈ ఇద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య మళ్లీ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో మీన వేడి నూనె తీసి కార్తీపై చల్లింది. చేతులు, ముఖం కాలిపోయి కార్తీ కిందపడిపోయాడు. తీవ్రంగా గాయాలైన అతడిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మీనాను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.