ADR Report: 7 పార్టీలకు అందిన 66 శాతం విరాళాలు గుర్తు తెలియని మూలాల నుంచి వచ్చాయట

సభ్యత్వ రుసుము, పార్టీ నిధులు, ఎన్నికల నిధుల ద్వారా వచ్చిన విరాళాలను సీపీఐ ప్రకటించింది. ఈ విశ్లేషణ కోసం ఎనిమిది జాతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకున్నామని, అయితే తమకు ఏ వైపు నుంచి నిధులు రాలేదని బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటించిందని ఏడీఆర్ తెలిపింది

ADR Report: 7 పార్టీలకు అందిన 66 శాతం విరాళాలు గుర్తు తెలియని మూలాల నుంచి వచ్చాయట

66% income of 7 political parties came from unknown sources says ADR

ADR Report: తాజాగా జాతీయ హోదా ఉన్న ఏడు రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, ఎన్‭పీపీ పార్టీలకు అందిన మొత్తాల్లో 66 శాతం నిధుల్లో కొన్ని ఎలక్ట్రోరల్ బాండ్స్ నుంచి అందగా, మరికొన్ని నిధులు గుర్తు తెలియని మూలాల నుంచి అందినట్లు పేర్కొంది. ఎలక్ట్రోరల్ రిఫార్మ్స్ మీద పని చేస్తున్న ఏడీఆర్ అనే స్వచ్ఛంద సంస్థ.. 2021-22 ఏడాదికి గాను ఏడు జాతీయ పార్టీలకు 2,172 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినట్లు వెల్లడించింది.

Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…

అయితే ఇందులో 83.41 శాతం అంటే 1,811.94 కోట్ల రూపాయలు గుర్తు తెలియని మూలాల నుంచి అందాయట. ఆదాయపు పన్ను రిటర్న్‌లు, భారత ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన విరాళాల ప్రకటనల విశ్లేషణ ఈ పార్టీల ఆదాయ వనరులు చాలా వరకు తెలియవు. ఏడీఆర్ ప్రకారం.. రాజకీయ పార్టీలు వార్షిక ఆడిట్ నివేదికలో తమకు అందిన ఆదాయం ఎంతో చెప్తారు, కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది స్పష్టం చేయరు. దీన్ని గుర్తుతెలియని ఆదాయ వనరుగా చెప్తారు.

MP Mithun Reddy : టీడీపీకి ఈసారి 23 సీట్లు కూడా రావు, చంద్రబాబు పాపాల గురించి ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు-మిథున్ రెడ్డి

తెలియని మూలాలలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్‌ల విక్రయం, సహాయ నిధి, ఇతర ఆదాయం, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాల నుండి విరాళాలు ఉంటాయి. ప్రస్తుతం, రాజకీయ పార్టీలు రూ. 20,000 లోపు ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల పేర్లను, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చే వారి పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయ పార్టీలకు ఈ మూలల నుంచే 66 శాతానికి మించి రావడంతో, వాటికి సంబంధించిన ఆధారాలు లేవు.

Das Ka Dhamki – Trailer 2.0 : దాస్ కా ధమ్కీ ట్రైలర్ రిలీజ్.. విశ్వక్సేన్ ఆ సినిమాలకు మాస్ వర్షన్ యాడ్ చేశాడా??

ఏడీఆర్ నివేదిక ప్రకారం, 2021-22లో 1,161 కోట్ల రూపాయలు తమకు అందినట్లు బీజేపీ ప్రకటించింది. ఇది జాతీయ పార్టీలకు అందిన మొత్తం ఆదాయంలో 53.45 శాతం. ఇక ఇతర ఆరు జాతీయ పార్టీలు ప్రకటించిన అజ్ఞాత వనరుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయం కంటే బీజేపీ ఆదాయం రూ.149.86 కోట్లు ఎక్కువ. టీఎంసీ రూ.528 కోట్లను గుర్తుతెలియని మూలాల నుంచి వచ్చిన ఆదాయంగా ప్రకటించింది, ఇది జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 24.31 శాతం.

Minister Kottu Satyanarayana : విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు- పవన్ కల్యాణ్‌కి మంత్రి హితవు

2004-05, 2021-22 మధ్య కాలంలో కూపన్‌ల విక్రయం ద్వారా కాంగ్రెస్, ఎన్‌సీపీల ఉమ్మడి ఆదాయం రూ.4,398.51 కోట్లుగా ఉందని ఏడీఆర్ తెలిపింది. ఆడిట్ నివేదిక ప్రకారం టీఎంసీ మొత్తం విరాళాల విలువ రూ. 38 లక్షలు (ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు మినహా) అయితే పార్టీ విరాళాల ప్రకటనలో రూ. 43 లక్షల విలువైన విరాళాలను ప్రకటించింది (రూ. 20,000 పైన విరాళాల వివరాలు). అందువల్ల, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పార్టీ ప్రకటనలో వ్యత్యాసం ఉందని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.

NIA raids: మంగళూరు, కొయంబత్తూరు పేలుళ్ల కేసులో మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎన్ఐఏ సోదాలు

సభ్యత్వ రుసుము, పార్టీ నిధులు, ఎన్నికల నిధుల ద్వారా వచ్చిన విరాళాలను సీపీఐ ప్రకటించింది. ఈ విశ్లేషణ కోసం ఎనిమిది జాతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకున్నామని, అయితే తమకు ఏ వైపు నుంచి నిధులు రాలేదని బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటించిందని ఏడీఆర్ తెలిపింది. 2021-22లో ఎనిమిది జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 3,289.34 కోట్లు. తెలిసిన మూలాల నుంచి ఈ రాజకీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 780.8 కోట్లు. ఇది పార్టీల మొత్తం ఆదాయంలో 23.74%. ఇక 2021-22లో తెలిసిన ఇతర వనరుల నుంచి ఈ పార్టీల మొత్తం ఆదాయం రూ. 336.3 కోట్లు. ఇది మొత్తం ఆదాయంలో 10.22 శాతం.