Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…

గుంటూరు పార్లమెంట్ స్థానం పరిధిలో హాట్ సీట్ ఏదైనా ఉందంటే.. అది మంగళగిరే. తాడేపల్లికి, విజయవాడకు దగ్గరగా ఉండటంతో పాటు బీసీ జనాభా అధికంగా ఉండే ప్రాంతమిది. ఇక్కడ.. వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నారా లోకేశ్‌ కూడా ఆర్కే మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…

guntur

Guntur Lok Sabha Constituency : గుంటూరు మిర్చి ఘాటు ఎలా ఉంటుందో ఏపీ మొత్తం తెలుసు. అయితే.. అక్కడి రాజకీయం అంతకన్నా ఘాటుగా ఉంటుంది. ఎందరో నేతలు ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉన్నత స్థాయికి ఎదిగారు. అత్యున్నత పదవులు చేపట్టారు. ఇదే జిల్లా నుంచి సీఎం పీఠం ఎక్కినవాళ్లూ ఉన్నారు. అయితే.. గత ఎన్నికల్లో స్టేట్ మొత్తం ఫ్యాన్ హవా కనిపించినా.. గుంటూరు పార్లమెంటులో స్థానంలో మాత్రం పసుపు జెండా ఎగిరింది. మరి.. ఈసారైనా వైసీపీ సత్తా చాటుతుందా? లేక.. టీడీపీయే మరోసారి విక్టరీ కొడుతుందా? గుంటూరు సెంటర్‌లో పార్టీల వ్యూహాలేంటి? పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో.. ఎలాంటి రాజకీయం నడుస్తోంది? సిట్టింగులకు.. ఫిట్టింగులు పెడుతున్న లీడర్లు ఎవరు?

modugula, galla

modugula, galla

గుంటూరు పార్లమెంట్ స్థానంలో ఈసారి పోటీ చేసేదెవరు?

గుంటూరు.. ఆంధ్రా రాజకీయానికి సెంటర్ పాయింట్ ఇప్పుడు. అలాంటి గుంటూరులో.. రాజకీయం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంటుంది. 1952లో గుంటూరు పార్లమెంట్ స్థానం ఏర్పడిన దగ్గర్నుంచి.. 2009 వరకు కాంగ్రెస్ డామినేషనే కనిపించింది. అంతకుముందు 2 సార్లు టీడీపీ గెలిచినా.. ఎఫెక్ట్ కాస్త తక్కువే ఉండేది. అయితే.. 2014 నుంచి గుంటూరు లోక్‌సభ స్థానంలో టీడీపీ జెండా ఎగరడం మొదలైంది. 2019లో.. రాష్ట్రమంతటా వైసీపీ ఫ్యాన్ గాలి వీచినా.. గుంటూరులో మాత్రం ఆ గాలిలో పసుపు జెండానే ఎగిరింది. వరుసగా రెండు సార్లు.. గల్లా జయదేవ్ఎం పీగా విక్టరీ కొట్టారు. అలాంటి.. గుంటూరు పార్లమెంట్ స్థానంలో.. ఈసారి ఎవరు పోటీ చేస్తారన్నది మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్‌గా మారింది. ఎందుకంటే.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి.. టీడీపీలో చేరడంతో గుంటూరు రాజకీయం మరింత హీటెక్కింది. ఇప్పుడు.. ఎంపీ అభ్యర్థిత్వం మీదే చర్చ నడుస్తోంది.

READ ALSO : Amalapuram Lok Sabha constituency : కోనసీమలో పట్టుకోసం అధికార వైసీపి ఎత్తుగడలు.. రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన !

మరోసారి వైసీపీ తరఫున బరిలో మోదుగుల…

గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ గెలిచినా.. టీడీపీ అధికారంలోకి రాలేదు. దాంతో.. ఆయన తన వ్యాపారాలపై ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. అప్పుడప్పుడు నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు. మరోసారి.. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు. అయితే.. కన్నా లక్ష్మీనారాయణకు ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే స్థానాలు ఆఫర్ ఇచ్చినట్లు.. టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి.. గుంటూరు, నరసరావుపేటలో.. ఏదో ఒక స్థానం నుంచి టీడీపీ తరఫున కన్నా ఫణీంద్రను నిలబెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అతను గనక.. నరసరావుపేట నుంచి ఎంపీగా బరిలోకి దిగితే.. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఆలపాటి రాజా పోటీ చేసే చాన్స్ ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నాయ్. ఒకవేళ జనసేన-టీడీపీ మధ్య పొత్తు కుదిరితే.. తెనాలి టికెట్‌ను ఆలపాటి రాజా త్యాగం చేయక తప్పదు. ఇక.. జనసేన నుంచి ఎంపీగా పోటీ చేసిన బోనబోయిన శ్రీనివాసయాదవ్.. ఈసారి సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దాంతో.. జనసేన నుంచి కొత్త అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది.

అదే క్రమంలో గుంటూరు పార్లమెంట్ స్థానం పరిధిలో 7 నియోజకవర్గాలున్నాయ్. అవి.. గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు, తెనాలి, తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు ఉన్నాయి. అక్కడి రాజకీయా పరిస్ధితులకు సంబంధించి

modugula, galla

modugula, galla

గుంటూరు వెస్ట్ నుండి టిడిపి అభ్యర్ధిగా కన్నా బరిలోకి దిగుతారా?

గుంటూరు వెస్ట్ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మద్దాల గిరి.. వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నంపై గెలుపొందారు. తర్వాత.. ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం.. టీడీపీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్‌గా.. కోవెలమూడి రవీంద్ర ఉన్నారు. ఇక.. ఎన్నారై మన్నవ మోహన సాయికృష్ణ సైతం.. టికెట్ రేసులో ఉన్నారు. అయితే.. బీజేపీ నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ సైతం.. గుంటూరు వెస్ట్ టికెట్‌ ఆశిస్తున్నారు. ఇప్పటికే.. ఆయన పోటీ చేయబోతున్నారన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఇక.. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాల గిరియే పోటీ చేసే అవకాశం ఉంది. అయితే.. కన్నాను ఎదుర్కోనే విషయంలో.. వైసీపీ అభ్యర్థిని మార్చే చాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

READ ALSO : Anakapalle Lok Sabha Constituency : పేరు మాత్రం సాఫ్ట్…రాజకీయం మాత్రం మస్త్ హాట్…అనకాపల్లిలో పోటాపోటీగా పొలిటికల్ వార్

giri, kanna, nani

giri, kanna, nani

గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫాపై జనంలో వ్యతిరేకత…టిడిపికి కలిసొస్తుందా….

గుంటూరు ఈస్ట్.. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతం. దాంతో. అన్ని పార్టీలు ఇక్కడ ముస్లిం అభ్యర్థులనే బరిలోకి దించుతున్నాయ్. 2014, 2019లో వైసీపీ తరఫున ముస్తఫా వరుసగా గెలిచారు. వైసీపీలో ఉండి టికెట్ ఆశించి భంగపడిన నసీర్ అహ్మద్.. టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎంపీ గల్లా జయదేవ్ ఆశీస్సులు మెండుగా ఉన్న వ్యక్తి నసీర్అ హ్మద్. దాంతో.. ఏపీ మొత్తం టీడీపీ తరఫున ఉన్న ఏకైక ముస్లిం అభ్యర్థి. అందువల్ల.. మరోసారి నసీరే గుంటూరు ఈస్ట్ నుంచి పోటీకి దిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కానీ.. అధిష్టానం మాత్రం ఈసారి బీసీ అభ్యర్థిని పోటీకి దించాలనే ప్రతిపాదన తెస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముస్తఫాపై.. జనంలో కొంత వ్యతిరేకత ఉంది. దీనికి తోడు ప్రత్యర్థులు కూడా టికెట్ ఆశిస్తుండటంతో.. ఈసారి తన కూతురిని పోటీకి దించాలని చూస్తున్నారు ముస్తఫా. సీఎం జగన్ కూడా సానుకూలంగానే ఉన్నారని.. ముస్తఫా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే.. ఆవిడ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. కానీ.. నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందనే ప్రజలు చెప్పుకుంటున్నారు. టీడీపీ గనక అభ్యర్థిని మారిస్తే.. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

mangalagiri

mangalagiri

READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

మంగళగిరిపై ఎఫెక్ట్ చూపుతున్న రాజధాని వ్యవహారం….

గుంటూరు పార్లమెంట్ స్థానం పరిధిలో హాట్ సీట్ ఏదైనా ఉందంటే.. అది మంగళగిరే. తాడేపల్లికి, విజయవాడకు దగ్గరగా ఉండటంతో పాటు బీసీ జనాభా అధికంగా ఉండే ప్రాంతమిది. ఇక్కడ.. వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నారా లోకేశ్‌ కూడా ఆర్కే మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక.. టీడీపీ బీసీ లీడర్ గంజి చిరంజీవి.. వైసీపీ చేరటంలోనూ ఆర్కే కృషి ఉంది. అయితే.. తాజా పరిణామాలతో.. ఆర్కేకు నిరసన సెగలు తగులుతున్నాయ్. 3 రాజధానుల అంశం తెరమీదకు రావడంతో అభివృద్ధి లేక, భూముల రేట్లు పడిపోవడంతో.. రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా.. రాజధాని వ్యవహారంపై.. మంగళగిరిపై బాగా ఎఫెక్ట్ చూపుతోంది. దాంతో.. ఇక్కడి నుంచి వైసీపీ ఎవరిని బరిలోకి దించుతుందనేది ఆసక్తిగా మారింది. ఇక.. టీడీపీ నుంచి నారా లోకేశే పోటీ చేసే అవకాశముంది. వైసీపీ నుంచి బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని.. వైసీపీ నేతలు భావిస్తున్నారు.

manohar, sivakumar

manohar, sivakumar

తెనాలి నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పోటీ చేసే చాన్స్…..

తెనాలిలో.. వైసీపీ నుంచి బత్తుని శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జనంతో పాటు కార్యకర్తలను కలుపుకొనిపోయే స్వభావం ఉన్న వ్యక్తి కావడంతో.. మళ్లీ ఆయనే పోటీలో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇక.. టీడీపీ నుంచి పోటీ చేస్తూ వస్తున్న ఆలపాటి రాజా.. ఈసారి గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం తాను సీటు త్యాగం చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. టీడీపీకి-జనసేనకు మధ్య పొత్తు కుదిరితే.. తెనాలి నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పోటీ చేసే అవకాశముంది. అయితే.. 3 ప్రధాన పార్టీలకు చెందిన నేతలంతా.. ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో.. పోటీ ఆసక్తికరంగా మారింది. టీడీపీ తరఫున ప్రస్తుతానికి.. ఆలపాటి రాజా పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. ఒకవేళ నాదెండ్ల మనోహర్ విజయవాడ నుంచి పోటీ చేస్తే.. మరోసారి టీడీపీ తరఫున ఆలపాటి రాజా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు.

READ ALSO : Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !

Sridevi, dokka, christiana

Sridevi, dokka, christiana

తాడికొండ వైసీపీ నుంచి టికెట్ రేసులో హెన్రీ క్రిస్టినా, డొక్కా, డైమండ్ బాబు

గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం తాడికొండ. టీడీపీకి పట్టున్న ఈ సెగ్మెంట్‌లో.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. 3 రాజధానుల అంశం తెరమీదకొచ్చాక.. అమరావతి రైతుల ఉద్యమాల సెగ.. శ్రీదేవికి తగులుతూ వస్తోంది. దాంతో.. తెలుగుదేశం నుంచి శ్రవణ్ కుమార్‌తో పాటు మరికొందరు నేతలు తాడికొండపై ఆశలు పెట్టుకున్నారు. ఇక.. ఎమ్మెల్యే శ్రీదేవిని కాదని వైసీపీ ఇక్కడ మరో నేతను ఇంచార్జ్‌ని నియమించింది. రాబోయే ఎన్నికల్లో.. వైసీపీ నుంచి హెన్రీ క్రిస్టినా, డొక్కా మాణిక్యవరప్రసాద్, గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు.. టికెట్ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం క్యాడర్‌లోనూ గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయ్. తెనాలి శ్రావణ్ ఒక వర్గానికే మేలు చేశారని.. మరో వర్గంలో అసహనంతో ఉంది. వైసీపీకి వ్యతిరేకంగా ఆయన పెద్దగా పోరాటాలే చేయలేదనే చర్చ జరుగుతోంది. కేవలం.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతారనే ప్రచారం ఉంది.

sucharita, daya sagar

sucharita, daya sagar

READ ALSO : Machilipatnam Lok Sabha Constituency : రసవత్తరంగా బందరు పాలిటిక్స్…మచిలీపట్నం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు !

ప్రత్తిపాడు టీడీపీలో కొంత గందరగోళ పరిస్థితులు…వైసీపీ ఎమ్మెల్యే సుచరిత భర్త దయాసాగర్ పోటీ చేసే అవకాశం

గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న మరో ఎస్సీ నియోజకవర్గం ప్రత్తిపాడు. గత ఎన్నికల్లో వీచిన వైసీపీ వేవ్‌లో.. ఈ సెగ్మెంట్ కూడా ఫ్యాన్ ఖాతాలోనే పడింది. ఇక్కడ.. మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆవిడ.. హోంమంత్రిగానూ పనిచేశారు. మంత్రి పదవి దక్కినా.. పెత్తనం ఇవ్వలేదనే టాక్ వినిపించింది. ఇక.. రెండో మంత్రివర్గ విస్తరణలో సుచరితను పక్కనపెట్టారు సీఎం జగన్. దాంతో.. ఆవిడ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆ సమయంలో.. ఆవిడ టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ.. ఈ మధ్యకాలంలో.. సీఎం జగన్‌ని కలిసిన తర్వాత.. నియోజకవర్గంలో ఆవిడ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ ఎన్నికల్లో.. సుచరితకు బదులు ఆమె భర్త దయాసాగర్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక.. టీడీపీకి సరైన అభ్యర్థి లేరని.. కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు కూడా నడుస్తున్నారు. ఇంచార్జ్‌గా మాకినేని పెదరత్తయ్య కొనసాగుతున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంలో.. ఓసీ పెత్తనమేమిటని.. కొందరు టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీలోకి వెళ్లడంతో.. ప్రత్తిపాడు టీడీపీలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి.. తెలుగుదేశం నుంచి కందుకూరి వీరయ్య టికెట్ రేసులో ఉన్నారు.

narendra,rosaiaha

narendra,rosaiaha

పొన్నూరు వైసీపీలో తారాస్థాయికి చేరిన గ్రూపు తగాదాలు…టీడీపీ నేత ధూళిపాళ్ళకు కలిసొచ్చేనా….

పొన్నూరు విషయానికొస్తే.. ఈ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట. ఇలాంటి చోట.. ధూళిపాళ్ల నరేంద్ర డబుల్ హ్యాట్రిక్ మిస్ అయ్యారు. గత ఎన్నికల్లో.. ఆయనపై కిలారి రోశయ్య వైసీపీ తరఫున గెలిచి.. తెలుగుదేశం కంచుకోటను బద్దలుకొట్టారు. పొన్నూరులో ముస్లిం ఓటర్లు.. డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. వాళ్లను.. ధూళిపాళ్ల కేవలం ఓట్ బ్యాంక్‌గానే చూశారని.. తమ సామాజికవర్గానికి చెందిన వాళ్లను తప్పితే.. మిగతా కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఎమ్మెల్యేగా.. కిలారి రోశయ్య గెలిచాక.. పొన్నూరులో అభివృద్ధి పనులు జరిగాయనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు వైసీపీలోనూ గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరాయి. కిలారి, రావి వెంకటరమణ వర్గాలు రెండుగా చీలాయి. దాంతో.. టికెట్ ఎవరికిస్తారన్న దానిపై.. ఇప్పటికైతే స్పష్టత లేదు. టీడీపీ తరఫున మరోసారి ధూళిపాళ్ల నరేంద్ర పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. గత ఎన్నికల్లో.. జనసేన నుంచి పోటీ చేసిన పార్వతినాయుడికి 12 వేల ఓట్లు వచ్చాయి. ఈసారి ఎవరిని బరిలోకి దించుతారన్న దానిపై క్లారిటీ లేదు. మొత్తంగా చూసుకుంటే.. పొన్నూరు రాజకీయం ఫుల్ హీట్ మీదుంది.

గుంటూరు మిర్చి లాగే.. గుంటూరు పార్లమెంట్ పరిధిలోనూ రాజకీయం చాలా హాట్‌గా సాగుతోంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే.. అన్ని పార్టీల నేతలు ఫుల్ యాక్టివ్ అయిపోయారు. ఇప్పటి నుంచి జనంలో ఉంటేనే.. ఎన్నికల నాటికి ఎంతో కొంత సెట్ అవుతందనే అంచనాతో ఉన్నారు. ముఖ్యంగా.. 3 రాజధానుల అంశం.. గుంటూరు పార్లమెంట్‌పై ఎఫెక్ట్ చూపే అవకాశం కనిపిస్తోంది. ఈసారి.. వైసీపీ విషయంలో ఓటర్లు ఎలా వ్యవహరించబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది. ఓవరాల్‌గా గుంటూరు లోక్‌సభ పరిధిలో పొలిటికల్ సీన్.. స్టేట్ పాలిటిక్స్‌ని ఎలా మారుస్తుందన్నది కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది. పార్టీలతో పాటు నాయకుల్లోనూ.. అప్పుడే టెన్షన్ మొదలైపోయింది.