MP Mithun Reddy : టీడీపీకి ఈసారి 23 సీట్లు కూడా రావు, చంద్రబాబు పాపాల గురించి ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు-మిథున్ రెడ్డి

టీడీపీ నేత నారా లోకేశ్ తన పాదయాత్రలో వైసీపీ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇకపై అలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయన్న మిథున్ రెడ్డి.. ఈసారి ఆ పార్టీకి అవి కూడా రావని జోస్యం చెప్పారు.(MP Mithun Reddy)

MP Mithun Reddy : టీడీపీకి ఈసారి 23 సీట్లు కూడా రావు, చంద్రబాబు పాపాల గురించి ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు-మిథున్ రెడ్డి

MP Mithun Reddy : టీడీపీ నేత నారా లోకేశ్ తన పాదయాత్రలో వైసీపీ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇకపై అలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయన్న మిథున్ రెడ్డి.. ఈసారి ఆ పార్టీకి అవి కూడా రావని జోస్యం చెప్పారు.

నారా లోకేశ్ సవాల్ ను స్వీకరించి తంబళ్లపల్లెకి వచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్లే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ భాషా ఆయన వెంట ఉన్నారు. బైక్ ర్యాలీతో ముదివెడు క్రాస్ నుంచి తంబళ్లపల్లెకి వచ్చారు వైసీపీ కార్యకర్తలు.(MP Mithun Reddy)

Also Read..Anantapur Lok Sabha constituency: పవన్ కల్యాణ్‌ను పోటికి దించుతారా.. కొత్త ముఖాలేమైనా బరిలోకి దిగబోతున్నాయా?

”లోకేశ్ సవాల్ స్వీకరించి తంబళ్లపల్లెకు వచ్చా. కేసులంటే నాకు భయం లేదని చెప్పిన లోకేష్ చర్చకు రాకుండా పారిపోయాడు. ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకొని ఇక్కడి నుంచి పారిపోయాడు. రాజకీయ లబ్ధి కోసమే సవాల్ విసిరాడు. రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాలకి నేను వెళుతున్నా. మళ్లీ సమయం, స్థలం చెబితే స్పీకర్ అనుమతి తీసుకొని వస్తా. లోపల భయం పెట్టుకొని పైకి మాటలు చెప్పడం కాదు. ఇప్పటికీ మేము చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాం. జగన్ సీఎం అయిన తర్వాత జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. హెరిటేజ్ కోసం విజయా డైరీని లేకుండా చేశారు. వయసుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే ఊరుకోబోము” అని లోకేశ్ కు వార్నింగ్ ఇచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి.

”పాపాల పెద్దిరెడ్డి, పాపాల మిధున్ రెడ్డి అని లోకేశ్ పదే పదే అంటున్నారు. పాపాల ట్రేడ్ మార్క్ ఎవరికన్నా ఉందంటే అది చంద్రబాబుకే. చంద్రబాబు పాపాల గురించి ఎన్టీ రామారావు చేసిన స్టేట్ మెంట్ ను ఓసారి లోకేశ్ చూడాలి. చంద్రబాబు ఎన్ని పాపాలు చేశారో ఎన్టీఆర్ మాటల్లోనే చెప్పారు. చంద్రబాబు పాపాల పుట్ట అని ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు. ఆ వీడియోలు గూగుల్ చేస్తే దొరుకుతాయి.

Also Read..Hindupur Lok Sabha Constituency: పరిటాల ఫ్యామిలీ ఫామ్‌లోకి వస్తుందా.. వైసీపీ పట్టు నిలుపుకోగలదా?

పబ్లిసిటీ కోసం నోరు పారేసుకోవద్దు. ప్రజలకు మీరు ఏం మేలు చేస్తారో దాని గురించి చెప్పండి. గత ఎన్నికల్లో మీరు ఎందుకు ఓడిపోయారో ఈ రోజుకైనా గ్రహించండి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. అంతేకానీ, వయసులో పెద్ద వాళ్లని వాడు వీడు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఓట్లు వేస్తారు అనుకుంటే పొరపాటే. ఇలానే మాట్లాడుతూ పోతే గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి కన్నా ఘోరమైన ఓటమి ఈసారి చవిచూడాల్సి వస్తుంది” అని ఎంపీ మిథున్ రెడ్డి.. నారా లోకేశ్ ను, టీడీపీ నాయకులను హెచ్చరించారు.(MP Mithun Reddy)

Also Read..Pawan Kalyan : కాపు-బీసీ కలిస్తే మనదే అధికారం, సగం పదవులు బీసీలకే- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు