NIA raids: మంగళూరు, కొయంబత్తూరు పేలుళ్ల కేసులో మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎన్ఐఏ సోదాలు

మాక్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) బ్లాస్ట్‌ను కూడా నిర్వహించినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. సమూహానికి వారి హ్యాండ్లర్ల ద్వారా క్రిప్టోకరెన్సీతో నిధులు సమకూరుతున్నట్లు పేర్కొంది. ఒక పెద్ద కుట్రలో భాగంగా, నిందితుడు మొహమ్మద్ షరీక్ నవంబర్ 19న మంగళూరులోని కద్రి ఆలయంలో ఐఈడీ పేలుడుకు ప్లాన్ చేశాడు.

NIA raids: మంగళూరు, కొయంబత్తూరు పేలుళ్ల కేసులో మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎన్ఐఏ సోదాలు

NIA raids multiple locations in MP, Maha in ISIS conspiracy case

NIA raids: తమిళనాడులోని కొయంబత్తూరులో, కర్ణాటకలోని మంగళూరులో జరిగిన పేలుళ్ల కేసుకు సంబంధించి తాజాగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. పూణెలోని తహ్లా ఖాన్, సియోనిలోని అక్రం ఖాన్ ఇళ్లలో సోదారు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఒక కశ్మీరి జంట మీద ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ సోదాలు నిర్వహించారు. వారిద్దరికీ ఐఎస్‭కేపీతో సంబంధాలు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు కేసు ఫైల్ చేశారు.

BJP Vs BRS : కేసీఆర్‌ను తెలంగాణకు పరిమితం చేయాలని కేంద్రం చూస్తోంది-బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

విచారణలో మరో నిందితుడు అబ్దుల్లా బాసిత్ పాత్ర ఉన్నట్లు తేలింది. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న మరో కేసులో అరెస్టైన బాసిత్, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. అదే రోజు శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసులో సియోనిలోని మరో మూడు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. శోధించిన ప్రదేశాలలో అనుమానితులైన అబ్దుల్ అజీజ్ సలాఫీ, షోబ్ ఖాన్ నివాస, వాణిజ్య ప్రాంగణాలు ఉన్నాయి. శివమొగ కేసులో నిందితులు – మహ్మద్ షరీక్, మాజ్ మునీర్ ఖాన్, యాసిన్, ఇతరులు ఉన్నారు. దేశం వెలుపల ఉన్న తమ హ్యాండ్లర్ సూచనల మేరకు, గోదాములు, మద్యం దుకాణాలు, హార్డ్‌వేర్ దుకాణాలు, వాహనాలు, ఇతర ఆస్తులు వంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారు.

Minister Kottu Satyanarayana : విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు- పవన్ కల్యాణ్‌కి మంత్రి హితవు

వారు మాక్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) బ్లాస్ట్‌ను కూడా నిర్వహించినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. సమూహానికి వారి హ్యాండ్లర్ల ద్వారా క్రిప్టోకరెన్సీతో నిధులు సమకూరుతున్నట్లు పేర్కొంది. ఒక పెద్ద కుట్రలో భాగంగా, నిందితుడు మొహమ్మద్ షరీక్ నవంబర్ 19న మంగళూరులోని కద్రి ఆలయంలో ఐఈడీ పేలుడుకు ప్లాన్ చేశాడు. అయితే, నేరస్థుడు లక్ష్య ప్రదేశానికి వెళుతున్న సమయంలో ఐఈడీ ఉన్నట్టుండి పేలిపోయింది. అబ్దుల్ సలాఫీ (40) సియోని జామియా మసీదులో మౌలానా కాగా, షోబ్ (26) ఆటోమొబైల్స్ విడిభాగాలను విక్రయిస్తున్నాడు. ‘ఎన్నికల్లో ఓటు వేయడం ముస్లింలకు పాపం’ వంటి దురుద్దేశపూరిత ఆలోచనలను సలాఫీ, షోబ్ ప్రచారం చేస్తూ దొరికిపోయారు.