Madhya Pradesh : ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట దారుణ హత్య.. మృతదేహాలను మొసళ్లున్న నదిలో పారవేత

పోలీసులు యువతి తండ్రి, ఆమె కుటుంబాన్ని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. యువ దంపతులను హత్య చేసినట్లు అంగీకరించారు. ఒకే ఇంటి పేరు ఉండటంతో వారి పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.

Madhya Pradesh : ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట దారుణ హత్య.. మృతదేహాలను మొసళ్లున్న నదిలో పారవేత

young couple killed

Young Married Couple Killed : మధ్యప్రదేశ్ లోని మోరేనా జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమ పెళ్లిని సహించని యువతి కుటుంబ సభ్యులు దారుణానికి పాల్పడ్డారు. ప్రేమ వివాహం చేసుకున్న యువ జంటను దారుణంగా హత్య చేశారు. యువ జంటను తుపాకీతో కాల్చి చంపారు. ఆపై మృతదేహాలకు రాళ్లు కట్టి మొసళ్లున్న నదిలో పడేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివానీ తోమర్(18), రాధేశ్యామ్ తోమర్(21) ప్రేమించుకున్నారు. మే 6న వారిద్దరూ తమ తమ ఇళ్ల నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

ఆ వీడియో క్లిప్ ను తమ కుటుంబాలకు పంపారు. తాము మేజర్లమని, ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తాము సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు. తమను ఇబ్బందులకు గురి చేయవద్దని తమ కుటుంబాలకు ఆ వీడియోలో కోరారు. అయితే, ఆ యువ జంట మిస్సింగ్ పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వారి కోసం గాలించారు. మే 11న ఆగ్రాలో వారు ఉన్నట్లు గుర్తించారు.

Income Tax Raid: విచారణకు రండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీకి ఐటీ అధికారుల నోటీసులు

అయితే తాము మేజర్లమని, తమ ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నట్లు శివానీ, రాధేశ్యామ్ పోలీసులకు తెలిపారు. అయినప్పటికీ ఆ యువ జంట మాట వినని పోలీసులు వారి కుటుంబాలకు వారిని అప్పగించారు. కాగా, ఆ యువ జంట ఇటీవల కనిపించకుండా పోయారు. దీంతో యువకుడు రాధేశ్యామ్ తండ్రి జూన్ 4న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి తండ్రి రాజ్ పాల్ తోమర్, ఆమె కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేశాడు. గతంలో వారు బెదిరించినట్లు తెలిపాడు.

మరోవైపు పోలీసులు యువతి తండ్రి, ఆమె కుటుంబాన్ని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. యువ దంపతులను హత్య చేసినట్లు అంగీకరించారు. ఒకే ఇంటి పేరు ఉండటంతో వారి పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. జూన్ 3న ఆ జంట తిరిగి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని తుపాకీతో కాల్చి చంపినట్లు వెల్లడించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను రాళ్లు కట్టి మొసళ్లు ఉండే చంబల్ నదిలో పడేసినట్లు పేర్కొన్నారు.

Anita Letter : జాతీయ మహిళా కమిషన్ కు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత లేఖ‍

కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యువతి తండ్రి రాజ్ పాల్ తోపాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శివానీ, రాధేశ్యామ్ మృతదేహాల కోసం రాష్ట్ర విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ బృందంతో చంబల్ నదిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ శైలేంద్ర చౌహాన్ పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.