Suryapet : బాబాయ్ గర్భవతిని చేశాడు..పెదనాన్న కొడుకు వేధింపులు, యువతి ఆత్మహత్య

తల్లిదండ్రులను కోల్పోయిన అనూషను పెదనాన్న చేరదీశాడు. అయితే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు బాబాయ్‌ పగిడిమర్రి విజయ్‌.

Suryapet : బాబాయ్ గర్భవతిని చేశాడు..పెదనాన్న కొడుకు వేధింపులు, యువతి ఆత్మహత్య

Suryapet

Suryapet : తల్లిదండ్రులను కోల్పోయిన అనూషను పెదనాన్న చేరదీశాడు. అయితే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు బాబాయ్‌ పగిడిమర్రి విజయ్‌. గర్భవతి అయిన అనూషను.. పెదనాన్న కొడుకు అంజి కూడా లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. మూడు రోజులుగా తీవ్ర మనస్థాపంతో భోజనం చేయడం మానేసిన అనూష జీవితంపై విరక్తి చెంది తనువు చాలించింది.

Read More : Neeraj Chopra : ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు అస్వస్థత

అనూష మృతితో పత్తేపురం గ్రామస్తులు నేరేడుచర్లలో ఆందోళనకు దిగారు. ఐదుగురిపై కేసు నమోదుచేస్తే పోలీసులు కేసును తారుమారు చేస్తున్నారని ఆరోపిస్తూ రాస్తారోకో చేశాడు. తమకు మృతదేహాన్ని అప్పగించాలని, విజయ్‌, అంజిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనూష ఆత్మహత్యకు కారణం ఆమె బాబాయ్‌, పెదనాన్న కొడుకేనంటున్న పత్తేపురం వాసులు….ఐదుగురిపై కేసు పెట్టామన్నారు.

Read More : Abortions: మగబిడ్డ కోసం 8 అబార్షన్లు.. 1500 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించిన భర్త

చిన్నప్పటి నుంచి చేరదీసిన కుటుంబంలోని వారే అనూష ఆత్మహత్యకు కారకులయ్యారని ఆరోపించారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనూషను అయినవారే ఓ పనిమనిషిలా చూశారని ఆరోపించారు పత్తేపురం వాసులు. ఎంతో సేవ చేసిన అనూషపై బాబాయ్‌ అఘాయిత్యం చేయడం, వరసకు అన్న అయినవాడే లైంగికం వేధించడం దారుణమని వాపోయారు.