Exams:ప్రిపరేషన్‌ సెలవులనుకోండి.. పరీక్షలకు సిద్ధం కండి!

లాక్ డౌన్ సమయాన్ని విద్యార్థులంతా ప్రిపరేషన్ సెలవులనుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. కరోనా వైరస్ అదుపులోకి వచ్చి లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే

Exams:ప్రిపరేషన్‌ సెలవులనుకోండి.. పరీక్షలకు సిద్ధం కండి!

Exams:లాక్ డౌన్ సమయాన్ని విద్యార్థులంతా ప్రిపరేషన్ సెలవులనుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. కరోనా వైరస్ అదుపులోకి వచ్చి లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా ప్రవేశ పరీక్షలు, ఉన్నత విద్య వార్షిక పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు.. విద్యార్థులు పరీక్షలకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

విద్యార్థులు ఇళ్లల్లోనే ఉండి ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా శిక్షణ పొందే అవకాశం లేకపోవచ్చునని తెలిపారు. ఈ సమయాన్నే ప్రిపరేషన్‌ సెలవులుగా విద్యార్థులంతా వినియోగించుకోవాలని సూచించారు. వచ్చే నెల 7నాటికి పరిస్థితి అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. అదేగాని జరిగితే మే చివరి నాటికి ఎంసెట్‌ పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ సంస్థతోనూ చర్చిస్తామన్నారు.

ఎంసెట్‌ అనంతరం జూన్‌లో ఇతర ప్రవేశ పరీక్షలు ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్‌ను కూడా నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ, బీటెక్, పీజీ కోర్సులకు సంబంధించి ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలను లాక్‌డౌన్‌ ముగియగానే నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పారు. జూన్‌లో పరీక్షలు నిర్వహించాల్సి వచ్చినా ప్రవేశాలను సైతం అదే నెలాఖరు నాటికి ప్రారంభించేలా చూస్తామని పాపిరెడ్డి వివరించారు.

Also Read |  నేనే నిశా జిందాల్..  మహిళను కాను.. నా అసలు పేరు ఇదే!