దరఖాస్తు చేసుకోండి : BECIL లో ఉద్యోగాలు

  • Edited By: veegamteam , December 31, 2019 / 09:55 AM IST
దరఖాస్తు చేసుకోండి : BECIL లో ఉద్యోగాలు

బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) లో 4 వేల ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్, అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ గా పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
స్కిల్డ్ మ్యాన్ పవర్ ట్రైనీ ప్రోగ్రామ్ – 2000
అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ట్రైనీ ప్రోగ్రామ్ – 2000

విద్యార్హత : అభ్యర్థులు 8వ తరగతి పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్,ఓబీసీ అభ్యర్ధులు రూ.500 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 27,2019.
దరఖాస్తు చివరి తేది : జనవరి 11,2020.
 

ట్రైనీంగ్ ప్రారంభ తేదిలు :
ఫస్ట్ బ్యాచ్ : జనవరి 11,2020.
సెకండ్ బ్యాచ్ : జనవరి 15,2020.
మూడో బ్యాచ్ : జనవరి 20,2020.