BEL లో డిప్యూటీ ఇంజనీర్ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 09:26 AM IST
BEL లో డిప్యూటీ ఇంజనీర్ ఉద్యోగాలు

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు చెల్లించనవసరంలేదు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3 దరఖాస్తుకు చివరితేది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే hrmilcom@bel.co.in చిరునామాకు మెయిల్ చేయవచ్చు. వయసు 26 సంవత్సరాలకు మించకూడ‌దు. 

* విద్యా అర్హత‌: 
BE/ B-TECH‌/ B.SC (క‌ంప్యూట‌ర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ఇన్‌ఫర్మేష‌న్ సైన్స్/ఇన్‌ఫర్మేష‌న్ టెక్నాలజీ) ఉత్తీర్ణత‌తో పాటు ఏడాది ప‌ని అనుభ‌వం ఉండాలి. 

* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి..