CBSE 10th Result 2022 : CBSE టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయి.. ఏయే వెబ్‌సైట్లలో ఫలితాలు ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

విద్యార్థుల నిరీక్షణ ముగిసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్ ఫలితాలు శుక్రవారం (జూలై 22)న విడుదల అయ్యాయి.

CBSE 10th Result 2022 : CBSE టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయి.. ఏయే వెబ్‌సైట్లలో ఫలితాలు ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

Cbse Class 10th Result 2022 Declared, Check Cbse 10th Results At Cbseresults.nic.in

CBSE 10th Result 2022 : విద్యార్థుల నిరీక్షణ ముగిసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్ ఫలితాలు శుక్రవారం (జూలై 22)న విడుదల అయ్యాయి. CBSE టెన్త్ బోర్డ్ ఫలితాలు అధికారిక వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. 10వ తరగతి విద్యార్థులు సంబంధిత CBSE 10వ బోర్డ్ ఫలితాలను 2022 CBSE అధికారిక వెబ్‌సైట్‌లో.. అంటే cbse.gov.inలో చెక్ చేసుకోవచ్చు.

CBSE టెన్త్ విద్యార్థులు ఈ వెబ్‌సైట్‌లలో కూడా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అందులో cbseresults.nic.in, parikshasangam.cbse.gov.in, results.cbse.nic.inలలో సంబంధిత 10వ తరగతి 2022 బోర్డు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 10వ తరగతి విద్యార్థులు సంబంధిత 10వ బోర్డు ఫలితాలను 2022 డిజిలాకర్‌లో లేదా SMS ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు.

గుర్తుంచుకోవలసిన వెబ్‌సైట్‌లు ఇవే :
– cbse.gov.in
– cbseresults.nic.in
– parikshasangam.cbse.gov.in
– results.cbse.nic.in

వెబ్‌సైట్లలో ఇలా ఫలితాలు చెక్ చేసుకోండి :

– అధికారిక వెబ్‌సైట్‌ results.cbse.nic.in విజిట్ చేయండి.
– హోమ్‌పేజీలో ‘CBSE 10వ టర్మ్ 2 రిజల్ట్ 2022’ లింక్‌పై క్లిక్ చేయండి.
– బోర్డు రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నెంబర్ నమోదు చేయండి.
– ‘Sumbit’పై క్లిక్ చేయండి.
– మీ CBSE టెన్త్ రిజల్ట్స్ 2022 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
– డౌన్‌లోడ్ చేసుకుని CBSE 10వ ఫలితాల మార్క్‌షీట్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

డిజిలాకర్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు
– యాప్‌లో లేదా వెబ్‌సైట్ ద్వారా డిజిలాకర్‌ లాగిన్ చేయండి.
– ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’పై Click చేయండి.
– CBSE క్లాస్ 10 Results 2022’ని ఎంచుకోండి.
– CBSE 10వ తరగతి ఫలితాలను డౌన్‌లోడ్ చేసేందుకు Login చేయండి.
– మీ CBSE 10 ఫలితాలు 2022 స్ర్కీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
– డౌన్‌లోడ్ చేసి.. ఫలితాలను ప్రింట్ అవుట్ తీసుకోండి.

Cbse Class 10th Result 2022 Declared, Check Cbse 10th Results At Cbseresults.nic.in (1)

Cbse Class 10th Result 2022 Declared, Check Cbse 10th Results At Cbseresults.nic.in

SMS ద్వారా ఇలా చెక్ చేసుకోవచ్చు :
– విద్యార్థులు cbse10 (rollno) (sch no) (center no) అని టైప్ చేసి, ఈ నంబర్‌ (7738299899)కు మెసేజ్ పంపాలి.
– CBSE క్లాస్ 10 టర్మ్ 1 ఫలితం తర్వాత, స్కోర్‌కార్డ్‌లు అదే నంబర్‌కు SMS ద్వారా పంపుతారు.

IVRS ద్వారా ఇలా చెక్ చేసుకోవచ్చు :
CBSE టర్మ్ 2 బోర్డు ఫలితాలను IVRS (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా కూడా చెక్ చేయవచ్చు. NIC టెలిఫోన్ నంబర్స్ ద్వారా ఫలితాలను IVRS ద్వారా యాక్సెస్ చేయవచ్చు. IVRS సౌకర్యం కోసం ఫోన్ నంబర్లు CBSE ద్వారా త్వరలో ప్రకటించనుంది.

GOOGLEలో ఎలా సెర్చ్ చేయాలంటే..
CBSE 10వ తరగతి ఫలితాలను నేరుగా Google సెర్చ్ ఇంజిన్ www.google.co.in ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు.

డైరెక్ట్ లింక్ : CBSE క్లాస్ 10 Results 2022 డౌన్ లోడ్ : 
https://cbseresults.nic.in/ ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా విద్యార్థులు సంబంధిత CBSE 10వ బోర్డ్ ఫలితాలను చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు .

Read Also : CBSE 12th Results : సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల..బాలికలదే పైచేయి