CBSE : సీబీఎస్ఈ టర్మ్ – 2 పరీక్షలు.. షెడ్యూల్ ఇదే

సీబీఎస్‌ఈ బోర్డు 10, 12వ తరగతుల విద్యార్థులకు టర్మ్‌-2 పరీక్షల పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 26 నుంచి థియరీ పరీక్షలు జరుగనున్నాయి. ఆఫ్‌లైన్‌ మోడ్‌లోనే...

CBSE : సీబీఎస్ఈ టర్మ్ – 2 పరీక్షలు.. షెడ్యూల్ ఇదే

Cbse

CBSE Term 2 Exam Schedule : సీబీఎస్‌ఈ బోర్డు 10, 12వ తరగతుల విద్యార్థులకు టర్మ్‌-2 పరీక్షల పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 26 నుంచి థియరీ పరీక్షలు జరుగనున్నాయి. ఆఫ్‌లైన్‌ మోడ్‌లోనే 10, 12వ తరగతుల పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణపై రాష్ట్రాలతో చర్చించిన తర్వాత దేశంలోని కొవిడ్‌ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సెకండ్‌ టర్మ్‌ పరీక్షలను ఆఫ్‌లైన్‌ మోడ్‌లో మాత్రమే నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ బోర్డు వెబ్‌సైట్‌లో శాంపిల్‌ క్వశ్చన్‌ పేపర్ ను అధికారులు ఉంచారు.

Read More : CBSE : 10,12వ పరీక్షలపై సీబీఎస్ఈ కీలక ప్రకటన

పేపర్ల మాదిరిగానే పరీక్షల ప్రశ్నాపత్రం ఉండనుంది. కరోనా మహమ్మారి విజృంభణతో ఈ ఏడాది రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టర్మ్‌-1 పరీక్షలు పూర్తయ్యాయి. 10, 12వ తరగతుల విద్యార్థులకు ఏప్రిల్‌ 26న పరీక్షలు మొదలు కానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లు మూసివేతను దృష్టిలో ఉంచుకొని రెండు పరీక్షల మధ్య గణనీయమైన వ్యవధి ఇచ్చినట్లు చేసిన సర్క్యులర్‌లో సీబీఎస్‌ఈ తెలిపింది. జేఈఈ మెయిన్‌ సహా ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని డేట్‌ షీట్‌ను తయారు చేసిట్లు పేర్కొంది. పరీక్షల ప్రిపరేషన్ కు చాలా సమయం ఉందని, మరిన్ని వివరాలకు సీబీఎస్ఈ వెబ్ సైట్ చూడాలని సూచించింది.

Read More : CBSE Class 12 Result 2021: సీబీఎస్ఈ 12 తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

కాగా,కరోనా కారణంగా గతంలో.. 2021-22 విద్యాసంవత్సరానికి సీబీఎస్​ఈ మార్పులు చేసిన విషయం తెలిసిందే. విద్యాసంవత్సరాన్ని రెండుగా విభజించి.. రెండు టర్మ్​-ఎండ్​ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే సిలబస్​లోనూ మార్పులు చేసింది. రెండు టర్మ్​ పరీక్షలు అయిన తర్వాతే తుది ఫలితాలు విడుదల చేస్తారు. 2022 మార్చి-ఏప్రిల్​లో సెకండ్ టర్మ్​ పరీక్షలు జరగనున్నాయి.